Share News

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశాం

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:55 PM

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా విద్యుత్‌ పంపిఫీ వ్యవస్థలను బలోపేతం చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని రత్నాపూర్‌లో 4.16లక్షలతో విద్యుత్‌ ఉపకేంద్రం, పన్నూరు గ్రామపంచాయతీ పరిధీలో రూ.3.5 లక్షలతో నిర్మాణం చేపట్టిన కస్తూర్బా నూతన భవనాలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశాం
సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రామగిరి, జూలై 15: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా విద్యుత్‌ పంపిఫీ వ్యవస్థలను బలోపేతం చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని రత్నాపూర్‌లో 4.16లక్షలతో విద్యుత్‌ ఉపకేంద్రం, పన్నూరు గ్రామపంచాయతీ పరిధీలో రూ.3.5 లక్షలతో నిర్మాణం చేపట్టిన కస్తూర్బా నూతన భవనాలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం మంవత్రి మట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం సింగరేణి సహకారంతో నాలుగు కోట్ల 16లక్షలతో నిర్మాణం చేసుకున్నామని పేర్కోన్నారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్‌ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కంటే అధిక స్థాయిలో అవసరం ఏర్పడుతున్న క్రమంలో రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర రాష్ట్రాలతో పాటు గ్రిడ్‌ నుంచి సైతం విద్యుత్‌ కొనుగొలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చిన్నపాటి సాంకేతిక సమస్యల వల్ల కలిగే విద్యుత్‌ అంతరాయాలను సైతం ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. రత్నాపూర్‌ గ్రామంలో నెలకొనే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ప్రజలకు ఎలాంటి విద్యుత్‌ సమస్యలు ఉత్పన్నం కావద్దనే ఉద్దేశంతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మరో తొమ్మిది సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రత్నాపూర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు. గ్రామానికి చెందిన మహిళలు మరిన్ని ప్రతిపాదనలు చేశారని వాటిపై సైతం దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపుకలెక్టర్‌ అరుణ, ఆర్డీవో హనుమానాయక్‌, పెద్దపల్లి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుదర్శన్‌, డీఈవో మాధవి, మంథని డీఈ ఈశ్వర్‌ప్రసాద్‌, ఏఈ మోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

మండలంలోని సెంటినరీకాలనీ మేకల మార్కెట్‌లోని శ్రీరామాంజనేయ స్వామి, ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలోని త్రయంబకేశ్వర ఆలయాల్లో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజాల్లో పాల్గొన్నారు. 101 కొబ్బరికాయాలను కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలోని సిబ్బంది మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు శాలువ, పూలదండలతో ఘనంగా సత్కరించారు.

ఫ మంత్రికి గీత కార్మికుల సత్కారం

తాటి, ఈత చెట్లు ఎక్కేటప్పుడు గీతకార్మికులకు జరిగే ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నిపుణులతో తయారు చేయబడిన కాటమయ్య రక్షణ కిట్లను అందించ డంపై కృతజ్ఞతతో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కల్వచర్ల గ్రామానికి చెందిన గీతకార్మికులు శాలువలతో ఘనంగా సత్కరించారు.

Updated Date - Jul 15 , 2024 | 11:55 PM