Share News

రైల్వేలో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నాం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:03 AM

రైల్వేలో నూతన విప్లవాన్ని తీసుకువ చ్చామని, సామాన్యుడు సైతం రైళ్లలో ప్రయాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామ ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా 26 కోట్ల 49 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా రిమోట్‌తో శంకుస్థాపన చేశారు.

రైల్వేలో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నాం
అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

- విమానాశ్రయాలకు దీటుగా రైల్వేల అభివృద్ధి

- వర్చువల్‌గా పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

పెద్దపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రైల్వేలో నూతన విప్లవాన్ని తీసుకువ చ్చామని, సామాన్యుడు సైతం రైళ్లలో ప్రయాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామ ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా 26 కోట్ల 49 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా రిమోట్‌తో శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తపల్లి-కొలనూర్‌ మధ్య ఎల్‌సీ 35వ గేట్‌ ఉప్పరపల్లి వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జిని కూడా ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ పథకం రెండో దశలో దేశ వ్యాప్తంగా 554 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నామని అన్నారు. విమానా శ్రయాలకు దీటుగా అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా దశలవారీగా దేశంలో ఉన్న అన్ని రైల్వే జంక్షన్లు, స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజ లకు రైల్వే సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. అయితే పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ను రెండో దశలో చేర్చినప్పటికీ, ఆరు నెలల నుంచే ఇక్కడ పనులు నడుస్తున్నాయి.

పెద్దపల్లి జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలి: ఎమ్మెల్యే

పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి పనుల కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న పలు ఎక్స్‌ప్రైస్‌ రైళ్లను ఇక్కడ నిలపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. పెద్దపల్లి జిల్లా కావడంతో రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా కూడా అయ్యిందన్నారు. గతంలో కంటే పెద్దపల్లి నుంచి రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్గం గుండా వెళుతున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, కేరళ ఎక్స్‌ప్రెస్‌, తదితర రైళ్లను ఇక్కడ నిలపాలని కోరారు. అలాగే కరీంనగర్‌ వయా పెద్దపల్లి మీదుగా తిరుపతికి వెళ్లే రైళ్లకు ఓదెల, పొత్కపల్లి స్టేషన్లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్‌ఎం మణి, పెద్దపల్లి ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ దాసరి మమతా రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బండారి రామ్మూర్తి, కౌన్సిలర్లు కొంతం శ్రీనివాస్‌రెడ్డి, నూ గిళ్ల మల్లయ్య, రాజ మహంత కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:03 AM