Share News

పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - May 29 , 2024 | 12:08 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను ప్రారంభించింది. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేలరూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది.

పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు

కరీంనగర్‌ రూరల్‌, మే 28: కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనను ప్రారంభించింది. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేలరూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలతో కొత్త రైతులకు పెట్టబడి సాయం అందని ద్రాక్షగా మారింది. 2019 ఫిబ్రవరి 1 వరకు కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. దీంతో 2019 తర్వాత భూములు కొనుగోలు చేసిన, కొత్తపట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు సమ్మాన్‌ నిధికి దరఖాస్తు చేసుకున్నప్పటికి పెట్టుబడి సాయం అందడం లేదు. పలువురు రైతులు తమకు పెట్టుబడి సాయం అందించాలని వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కరీంనగర్‌ మండలంలో మొత్తం 5,250 మంది రైతులు కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రయోజనం పొందుతున్నారు. మొదటి విడతలో 6,322 మందికి సాయం అందింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిబందనల కారణంంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. పలువురు రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో సాయం అందుకోలేకపోతున్నారు. ఆదార్‌ నంబర్‌ మొబైల్‌ నంబర్‌కు చేయకపోవడం, బ్యాంకు ఖాతాలకు ఆదార్‌ లింక్‌ చేయకపోవడం, ఈ కేవైసీ చేసుకోకపోవడంతో పెట్టుబడి సాయానికి దూరమవుతున్నారు. ప్రసుత్తం 656 మంది రైతులకు పలు కారణాలతో పెట్టబడి సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తులు పెట్టుకున్నప్పటికి తమకు డబ్బులు పడటం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 29 , 2024 | 12:08 AM