Share News

వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:14 AM

మహనీయులు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ అన్నారు.

వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకం

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 11 : మహనీయులు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్న నిర్వహించిన పాత్ర, ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడి తరగతుల అధికారి చదివి వినిపించారు. అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, ఆయన అందించిన స్ఫూర్తిని అందరూ స్మరిం చుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరిం చుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి, విలువలు తెలుస్తాయని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడిగా బ్రి టిష్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వార్థ ప్రయోజ నాలతో బ్రతికే సమాజంలో ఆనాటి కాలంలోనే ఆయన నిస్వార్ధంగా మంచి విలువలను పాటిస్తూ దేశం కోసం పోరాటం చేశారని అన్నారు. ఓబన్న నిరంతరం కష్టపడే తత్వంతో జీవితాంతం చెడుపై పోరాటం చేస్తూ గడిపారని ఆయన చేసిన సేవలను గుర్తు చేసు కోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జే.రంగారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌, ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్‌, వడ్డెర సంఘం జిల్లా వైస్‌చైర్మన్‌ కుంట పోశెట్టి, జిల్లా కార్యదర్శి వోళ్ళేపు బాలకృష్ణ, పట్టణ ప్రెసిడెంట్‌ కొట్టే సమ్మయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM