Share News

వృత్తి శిక్షణ తరగతులు ప్రారంభం

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:03 AM

ఆర్‌జీ-1 ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు, మహిళలకు సామాజిక భాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బుధవారం వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు.

వృత్తి శిక్షణ తరగతులు ప్రారంభం

గోదావరిఖని, నవంబరు 27 (ఆంధ్ర జ్యోతి) : ఆర్‌జీ-1 ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు, మహిళలకు సామాజిక భాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బుధవారం వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పారు. ఈ కార్యక్రమాన్ని సేవా అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్‌, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమా ర్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిం చారు. టైలరింగ్‌, మగ్గం వర్క్స్‌, బ్యూటీషి యన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ తదితర 15 వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. అలాగే గత సంవత్సరం వృత్తి శిక్షణ పరీక్షల్లో ఉత్తీ ర్ణత సాధించిన 18మంది అభ్యర్థులకు సర్టి ఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అని త మాట్లడుతూ ప్రస్తుత సమాజానికి అను గుణంగా ప్రతి ఒక్కరు తమ కాళ్ల మీదా తాము నిలబడానికి వివిధ వొకేషనల్‌ ట్రైనింగ్‌ పొందుతున్నారని, సమాజంలో వివిధ ఫ్యాషన్‌తో కూడిన డిజైన్లు కొనుగో లు చేయడానికి ఖర్చుకు వెనుకాడటం లేద న్నారు. ప్యాషన్‌తో కూడిన కుట్లు అల్లికలు, మగ్గంవర్క్స్‌, అందంగా అలంకరించడానికి బ్యూటీషియన్‌లాంటి వాటికి ఎక్కువ ప్రా ధాన్యం ఇస్తున్నారన్నారు. ఇటువంటి వాటి లో శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి సంస్థ ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. మార్కెట్‌ కు అనుగుణంగా వివిధ శిక్షణలు పొందా లని, ప్రతిఒక్కరు శ్రద్ధతో మెళకువలు నేర్చు కొని ప్రావీణ్యం సాధించి సొంతంగా యూ నిట్స్‌ నెలకొల్పుకొని స్వయంఉపాధి పొందా లని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సీఎంఓ ఐఏ ప్రతినిధి శ్రావణ్‌ కుమార్‌, ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌ సింగ్‌, డీజీఎం(పర్సనల్‌) డీ కిరణ్‌ బాబు, హన్మంతరావు, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, సేవా సమితి సెక్రెటరీ శిరీష, బీనా సింగ్‌, లేడీస్‌ క్లబ్‌ సెక్రెటరీ చిలుక లక్ష్మి, సభ్యులు రశ్మిసింగ్‌, కళ్యాణి, మేడి తిరుపతి, శిక్షకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:03 AM