Share News

కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:13 AM

నగరంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 11: నగరంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంపై ప్రత్యేక కథనం.. 150 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారని అర్చకులు చెబుతారు. ఆనాటి తహసీల్దార్‌ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో శ్రీభూదేవీ సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులు మూడు బేరాలున్నాయి. అందులో మూలమూర్తి ముందు ఒక శాశ్వత బేరం ఉంటుంది. ఆలయంలో సాలగ్రామలున్నాయి. స్వామి ముందు జయవిజయులు దర్శనమిస్తారు. ప్రతి శనివారం, విశేష పర్వదినాల్లో ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. నగరంలో ఒకటే ఒకటిగా చెప్పుకునే లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని 1961లో వ్యాపారవేత్త గౌరిశెట్టి రాజేశం కట్టించారు. ఆలయంలో జైపూర్‌ పాలరాతితో రూపొందించిన స్వామివారి, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. శ్రీరామ, దసరా నవరాత్రులు, ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశి తిథులకు స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వుడుతల వెంకన్న తెలిపారు.

- ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం..

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

అందరం కలసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. అన్ని శాఖల అధికారులు, నగర ప్రముఖులు, దాతలు, పలు సంస్థల బాధ్యులు, వేదపండిత, అర్చక బృందంతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. నేను కూడా ఓ మామూలు భక్తుడి లాగే ఉత్సవాల్లో పాల్గొంటాను. ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలి.

Updated Date - Feb 12 , 2024 | 12:13 AM