Share News

వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 25 , 2024 | 12:28 AM

పోలీస్‌ వాహనాల డ్రైవర్లు నిత్యం అప్రమత్తతో ఉండాలని, డ్రైవింగ్‌ చేసేటప్పుడు డ్రైవింగ్‌పైనే దృష్టి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

కోల్‌సిటీ, మే 24: పోలీస్‌ వాహనాల డ్రైవర్లు నిత్యం అప్రమత్తతో ఉండాలని, డ్రైవింగ్‌ చేసేటప్పుడు డ్రైవింగ్‌పైనే దృష్టి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని పోలీస్‌ వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రైవర్లు తమ వాహనాలను సొంతవాహనాల్లో మంచి కండీషన్‌లో ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌,ఇంజన్‌ ఆయిల్‌, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. ప్రతిఏటా రోడ్డు ప్రమాదాలతో 1.69లక్షల మంది మరణి స్తున్నారని, 4లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారన్నారు. ప్రతి నిమిషం ఒక ప్రమాదం జరుగుతుందన్నారు. డ్రైవర్ల చిన్ననిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు గురైన వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి తీసుకువస్తుందన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు అలర్ట్‌గా ఉండాలని, పరిసరాలను నిశితంగా గమనిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. విశ్రాంతి సమయం వృథా చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని, విశ్రాంతి తీసుకో కుండా వాహనాలు నడిపితే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. డ్రైవర్ల భావోద్వేగాల న్నీ వాహనాలు ఎక్కే వరకే ఉండాలని, డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నాక పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌పైనే దృష్టి ఉంచాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్లు మాట్లాడ డం, ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించడం చేయవద్దన్నారు. డ్రైవర్లు సీటు బెల్ట్‌ ధరిం చమేకాకుండా వాహనంలో కూర్చున్న అధికారులు కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్‌ ధరించేలా చొరవ చూపాలన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా పోలీస్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మి న్‌) రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఎంటీఓ మధు, ఆర్‌ఐ మల్లేషం, శ్రీనివాస్‌, రామగుండం ఎంవీఐ మధు, ఆర్‌ఎస్‌ ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:28 AM