Share News

అకాల వర్షం..ఆపార నష్టం

ABN , Publish Date - May 08 , 2024 | 01:14 AM

మండలంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడి సిపోగా, మామిడి కాయలు నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండిం చిన ధాన్యం పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీరుమున్నీరుగా విల పిస్తున్నారు.

అకాల వర్షం..ఆపార నష్టం

పెగడపల్లి, మే 7 : మండలంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడి సిపోగా, మామిడి కాయలు నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండిం చిన ధాన్యం పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో రైతన్నలు కన్నీరుమున్నీరుగా విల పిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు కుప్పల కిందికి నీరు చేరి నీటమునిగాయి. పలు గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలు తడవగా, వాన నీటికి వడ్లు కొట్టుకు పోయి రైతన్నలకు నష్టం వాటిల్లింది. నంచర్ల గ్రామంలో భారీ ఈదురు గాలులకు తాటిచెట్టు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో స్తంబం విరి గిపడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షానికి నష్టపోయిన త మను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.

మల్యాల: అకాల వర్షంకు మండలంలోని పలు గ్రామాల్లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీరు చేరి ధాన్యం తడిచింది. మల్యాల, ముత్యంపేట, రామన్నపేట, తాటిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడువగా రైతులు వాటిపై కవర్లు కప్పుకు న్నారు. ధాన్యం కొనుగోల్లు నత్తనడకన సాగుతుండడంతో ధాన్యం తడిచి నష్టపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

వెల్గటూర్‌: మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం స్వల్పంగా తడిచింది. గాలి జోరుగా వీయ డంతో మామిడి కాయలు నేలరాలాయి. వర్షం ఎక్కడ ఎక్కువ పడుతుం దో ధాన్యం తడిచి పోతుందోనని రైతులు ఆందోళన చెందారు. ఽధాన్యం స్వల్పంగా తడవడంతో తలలు పట్టుకున్నారు. దాన్యం కుప్పలు తడు వకుండా కొనుగోలు కేంద్రాలకు ఉరుకులు పరుగులపై వచ్చి కవర్లు కప్పు కున్నారు. వెల్గటూర్‌లో రాష్ట్రం లోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆందోళన చెందిన ప్రజలు మంగళవారం కురిసిన జల్లులకు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.

గొల్లపల్లి : మండలంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం మంగళవారం రైతులకు ఆపార నష్టాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యం వర్షార్పణం అయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఆరుగాళం కష్టించి పండించిన పంట నీళ్లపాలు కావడంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆకాల వర్షానికి గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుతో పాటు పలు గ్రామా ల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి పోసిన ధాన్యం వర్షానికి తడిసిముద్దయ్యాయి. కొన్ని కేంద్రాల్లో వరి ధాన్యం రాశుల మధ్య నిలిచిన వర్షపు నీటిని రైతులు తొలగించారు. ఒక్క గొల్లపల్లి ఏఎంసీలోనే రవాణా కు నోచుకోకుండా మూలుగుతున్న సుమారు పది వేల ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిముద్దవగా, విక్రయానికి పోసిన పది వేల క్వింటాళ్ల మేర ధాన్యం తడిసిపోగా మరో తొమ్మిది వేల క్వింటాళ్ల మేర పాక్షికంగా తడిసి నట్లు అధికారులు ప్రాథమికంగా ఆంచనా వేశారు. పలు గ్రామాల్లో ఈదు రుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి నేలకొరిగాయి.

కోరుట్ల రూరల్‌ : మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో మామిడి నేల రాలింది. ఒక్కసారిగా ఊష్ణోగ్రతలు చల్లబడటంతో ప్రజల కు ఉపశమనం కలిగినట్లు అయింది. వివిధ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యంపై రైతులు కవర్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు.

Updated Date - May 08 , 2024 | 01:14 AM