Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మూడు నెలలుగా అందని వేతనాలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:13 AM

మండలంలో 17 గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఈ పంచాయతీల్లో 92 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరందరూ మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

మూడు నెలలుగా అందని వేతనాలు

చిగురుమామిడి,మార్చి 3: మండలంలో 17 గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఈ పంచాయతీల్లో 92 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరందరూ మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా రాకపోవడంతో వేతనాలు ఇవ్వలేదని మాజీ సర్పంచ్‌ లు అంటున్నారు. అరకొరగా వచ్చిన నిధులు విద్యుత్‌ బిల్లులు, ఇతర ఖర్చులకే సరిపోయేవి. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.

ఫ కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉన్నది..

వెల్పుల ప్రశాంత్‌, మూదిమాణిక్యం

గ్రామాంలో ఉన్న అనేక రకాల పారిశుద్ద పనులు చేస్తూ ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే ఉంటాం. మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మా గోడును పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పటికైనా అధికారులు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి.

ఫ మా బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదు..

- చెల్పూరి శంకర్‌, ఇందుర్తి

మూడు నెలలుగా జీతాలు లేవు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ఎవ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అప్పులు చేసి కుటుంబాన్నా పోషించుకుంటున్నాం. మాకు వెంటనే జీతాలు ఇచ్చి ఆదుకోవాలి.

--------------------------------------------------------------------------------

Updated Date - Mar 04 , 2024 | 12:13 AM