Share News

అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:25 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర కాకమందే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, దీన్ని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ ఆసత్య ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు

గోదావరిఖని, జనవరి 28: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర కాకమందే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, దీన్ని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ ఆసత్య ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం రాత్రి గోదావరి ఖని మార్కండేయకాలనీలోని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సిం గ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో 48గంట ల్లో రెండు పథకాలను అమలు చేసిందని, మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు రూ. 10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం జరుగు తుందన్నారు. తెలంగాణ కొంగు బంగారమైన మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు మహిళలకు ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్ర యాణం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. మిగతా నాలుగు పథకాల ను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.

రామగుండంలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయండి..

రామగుండం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రామగుండంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. సన్మాన సభలో మక్కాన్‌సిం గ్‌ మాట్లాడుతూ రామగుండం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఖజా నా మొత్తం ఖాళీ అయ్యిందని, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం కొత్తగా పరిశ్రమలను తీసుకురావాలని, పోలీసులు రామగుండంలో లాఅండ్‌ ఆర్డర్‌ను కాపాడాలని, ఎవరైనా పంచాయితీలు చేసినా, ఇతర దందాలు చేసినా తనకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని, రామగుండాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు, పార్టీకి ఎవరైనా నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించా రు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, కొలిపా క సుజాత, పెద్దెల్లి తేజస్వినిప్రకాష్‌, నాయకులు నడిపెల్లి రాంమోహన్‌ రావు, కాల్వ లింగస్వామి, పాతిపెల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, ఫజల్‌ బేగ్‌, గట్ల రమేష్‌, నాయిని ఓదెలు, తిప్పారపు శ్రీనివాస్‌, బొమ్మక రాజేష్‌, మాదరబోయిన రవికుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రికి ఘనంగా సన్మానం..

రాష్ట్ర ఐటీశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి సారిగా గోదావరిఖనికి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ను ఆదివారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఘనంగా సన్మానించారు. మంత్రి శ్రీధర్‌బాబును బీ పవర్‌హౌస్‌గడ్డ నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో మున్సిపట్‌ టీ జంక్షన్‌ వరకు చేరుకున్నారు. మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద గజమాలను క్రేన్‌ సహా యంతో శ్రీధర్‌బాబుకు వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్య క్షుడు బొంతల రాజేష్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తా ఫా, కొలిపాక సుజాత, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:25 AM