Share News

జీడీకే 7ఎల్‌ఈపీ మృతులకు ఘన నివాళి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:37 AM

జీడీకే 7ఎల్‌ఈపీ ప్రమాదంలో మరణించిన కార్మికులకు కార్మిక సంఘాల నాయకులు నివాళులు అర్పించా రు.

జీడీకే 7ఎల్‌ఈపీ మృతులకు ఘన నివాళి

యైుటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 16: జీడీకే 7ఎల్‌ఈపీ ప్రమాదంలో మరణించిన కార్మికులకు కార్మిక సంఘాల నాయకులు నివాళులు అర్పించా రు. ఆదివారం గని సమీపంలోని మృతుల స్థూపం వద్ద ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో కార్మికులు, పలువురు యూనియ న్ల నాయకులు పాల్గొన్నారు. మృతుల స్థూపానికి పూలమాలలు వేసి మరణించిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. 7ఎల్‌ఈపీ ప్రమాదం సింగరేణిలో అతిపెద్ద ప్రమా దమని, ఈప్రమాదం సింగరేణికి మాయని మచ్చని పేర్కొన్నారు. గనిలో నీటి ప్రవాహం చేరడంతో 17 మంది కార్మికులు మృతిచెందినట్టు, 21ఏళ్ళు గడిచినా ఈప్రమాదాన్ని కార్మికవర్గం మరువలేదన్నారు. రక్షణలో నిర్లక్షం కారణంగానే 7ఎల్‌ఈపీ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీ యూ, టీబీజీకేఎస్‌ నాయకులు జనక్‌ప్రసాద్‌, నర్సింహారెడ్డి, సత్యనారాయ ణరెడ్డి, రాజారత్నం, రవీందర్‌, సాంబశివరావు, అయిలి శ్రీనివాస్‌, మాదా సు రామ్మూర్తి, కొంగర రవీందర్‌, నాగేశ్వర్‌, కార్మికులు పాల్గొన్నారు.

రక్షణ వైఫల్యానికి 17 మంది బలి : బీఎంఎస్‌

సింగరేణి యాజమాన్యం రక్షణలో విఫలమైన కారణంగా 17 మంది కార్మికులు బలైనట్టు బీఎంఎస్‌ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ప్రకటనలో పేర్కొన్నారు. 2003 జూన్‌ 16న మొదటి షిఫ్టులో గనిలో నీటి ప్రవాహం రావడంతో 17 మంది కార్మికులు మరణించడం సింగరేణి చరిత్రలో చీకటిరోజని పేర్కొ న్నారు. ఈ ప్రమాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు అఖిల భారతీయ కదాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ జాతీయ రక్షణ కమిటీ దర్యాప్తు చేసి అధికారుల నిర్లక్షం కారణంగా ప్రమాదం జరిగిందని నిర్థారించినట్టు సత్తయ్య పేర్కొన్నారు. జ్యుడిషియల్‌ ఎంక్వయిరీలో బాధ్యులుగా తేలిన వారికి శిక్షించాలని ఆదేశాలు వచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని సత్తయ్య తెలిపారు. సింగరేణి రక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికీ రక్షణ వ్యవస్థ లోపభూయి ష్టంగా ఉన్నట్టు సత్తయ్య పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:37 AM