Share News

టీఎస్‌టీపీపీ రెండో యూనిట్‌ ట్రయల్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:56 PM

ఎన్టీపీసీకి చెందిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్‌-1 పూర్తి సామర్థ్యానికి చేరుకుంది.

టీఎస్‌టీపీపీ రెండో యూనిట్‌ ట్రయల్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 11 : ఎన్టీపీసీకి చెందిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ) స్టేజ్‌-1 పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. 800 మెగావాట్ల 2వ యూనిట్‌కు ఆదివారం నిర్వహించిన ట్రయల్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఈ యూనిట్‌ పూర్థిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకోవడంతో మొ త్తం 1600 మెగావాట్ల(800 మెగావాట్ల 2యూనిట్లు) మొద టి దశ సంపూర్ణమైంది. పాజెక్టులోని 800మెగావాట్ల 2వ యూని ట్‌కు నిర్వహించిన ట్రయల్‌ ఆపరేషన్‌ ఆదివారం ఉదయం 11.02 గంటలకు విజయవంతంగా పూర్తయింది. గత గురువా రం యూనిట్‌కు సంబంధించి ట్రయల్‌ ఆపరేషన్‌ ప్రారంభిం చారు. 72గంటలపాటు కొనసాగిన ట్రయల్‌ ఆపరేషన్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. 2వ యూనిట్లో 800 మెగావాట్లకు పైగా లోడ్‌తో ఉత్పత్తి కొనసాగింది. ట్రయల్‌ ఆపరేషన్‌ చివరి దశ ను ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేదార్‌ రంజన్‌ పాండు వివి ధ విభాగాల జీఎంలు జీజీ.సురేష్‌, సంజీవ్‌సాహా, సంతోష్‌ తివారి, మోహన్‌రెడ్డి, అలోక్‌కుమార్‌ త్రిపాఠి, రవింద్ర పటేల్‌, కేసి.సింగ రాయ్‌, మేముల అనిల్‌ కుమార్‌, ఏజీఎం(హెచ్‌ఆర్‌) సిక్దర్‌, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ట్రయల్‌ ఆపరేషన్‌ పూర్తవడంతో మరో రెండు, మూడు రోజుల్లో 2వ యూనిట్‌ను కమిర్షియల్‌ ఆపరేషన్‌గా(సీవో డీ) ప్రకటించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, యూనిట్‌ ఫుల్‌ సామర్థ్యంతో ట్రయల్‌ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఈడీ కేదార్‌ రంజన్‌ తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఆనం దాన్ని పంచుకున్నారు. నాలుగునెలల క్రితం 800 మెగావాట్ల 1వ యూని ట్‌ను సీవోడీ ప్రకటింన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్‌ తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేస్తారు. రెండో దశలో 2400 మెగావాట్ల ప్రాజెక్టును నెలకొల్పాల్సి ఉంది.

సుదీర్ఘ కాలం తరువాత..

అనేక సవాళ్లు, అవాంతరాల తరువాత తెలంగాణ సూపర్‌ థర్మల్‌ ప్రాజెక్టు పూర్తయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల ప్రాజెక్టును ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెలకొల్పాలని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 2016లో పునాదిరాయిపడిన స్టేజ్‌-1 మొదట్లో వేగంగా నిర్మాణ పనులు జరిగినా కరోనా, సాంకేతిక కారణావల్ల తీవ్ర జాప్యమైంది. 2020-21లోనే ప్రాజెక్టులోని మొదటి, రెండవ యూని ట్లను పూర్తిచేయాలని ప్రణాళికలు రూపొందించినప్పటికీ కరోనా, సాంకే తిక సమస్యలు రావడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. గత ఏడాదిన్నర కాలంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగంగా చేయ డం ద్వారా స్టేజ్‌-1లో రెండు యూనిట్లు ఉత్పత్తి దశకు చేరాయి. 800 మెగావాట్ల 1వ యూనిట్‌ను గత ఏడాది అక్టోబరు 3న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. రెండో యూనిట్‌ ఆదివారం ట్రయల్‌ ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేసుకొని కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరే షన్‌కు సిద్ధమైంది.

Updated Date - Feb 11 , 2024 | 11:57 PM