Share News

సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ అమలుపై శిక్షణ తరగతులు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:56 PM

సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ తయారీ, అమలుపై శిక్షణ తరగతులు గురువారం సింటార్స్‌ శిక్షణ కేంద్రంలో ప్రా రంభమయ్యాయి.

సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ అమలుపై శిక్షణ తరగతులు

యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 29: సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ తయారీ, అమలుపై శిక్షణ తరగతులు గురువారం సింటార్స్‌ శిక్షణ కేంద్రంలో ప్రా రంభమయ్యాయి. ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం అధికారులకు రెండు రోజుల పాటు ఈశిక్షణ తరగతులు జరగనన్నాయి. జీఎం సేఫ్టీ గురువయ్య శిక్షణా తరగతులను ప్రారంభించారు. సింగరేణిలో ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, చేసే పనులను భద్రతతో చేయాలని సూచించారు. పూర్తి భాద్యతతో సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం పనులు చేయాలని సూచించారు. అన్ని విభాగాల్లో ఎస్‌ఓపీ తయారుచేసి అమలు చేయనున్నట్టు గురువయ్య పేర్కొన్నారు. అంతర్జా తీయ ప్రమాణాలతో రూపొందించబడి రుజువైన ఈపద్ధతి ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో కూడా తయారుచేసి అమలు చేయాల్సిన అవసరాన్ని వివరిం చారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఎస్‌ఓపీపై అవ గాహన పెంపొందించుకోవాలని అధికారులకు గురువయ్య సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ, ఆర్జీ రీజియన్‌ సేఫ్టీ జీఎం రఘుకుమార్‌, జీఎం ఎక్స్‌ప్లోరేషన్‌ శ్రీనివాసరావు, ట్రైనింగ్‌ మేనే జర్లు ఏకేకే శర్మ, విజయ్‌కుమార్‌తో పాటు కొత్తగూడెం రామగుండం రీజి యన్‌ల అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:56 PM