నేడు బక్రీద్
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:22 AM
ముస్లింలు సోమవారం (ఈద్ ఉల్ జుహా) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. నగరంలోని పురానీ, రేకుర్తి సాలెహ్‌నగర్ ఈద్గాలతో పాటు కొత్తపల్లి, చింతకుంట, బైపాస్ రోడ్ ఈద్గాల్లోలో సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి.

కరీంనగర్ కల్చరల్, జూన్ 16: ముస్లింలు సోమవారం (ఈద్ ఉల్ జుహా) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. నగరంలోని పురానీ, రేకుర్తి సాలెహ్‌నగర్ ఈద్గాలతో పాటు కొత్తపల్లి, చింతకుంట, బైపాస్ రోడ్ ఈద్గాల్లోలో సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. నగరంలోని ప్రధాన మసీదులతో పాటు గ్రామాలు, మండల కేంద్రాలలోని మజీద్‌లలో, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బక్రీద్ సందర్భంగా మార్కెట్‌లో, శివారు ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల అమ్మకాల సందడి నెలకొంది. పలు కూడళ్లలో గ్రామాల నుంచి విక్రయదారులు గొర్రెలు, మేకలు తీసుక వచ్చి అమ్ముతుండగా గిరాకీ పెరిగింది.