Share News

మూత బడులు తెరుచుకునేలా...?

ABN , Publish Date - May 26 , 2024 | 12:57 AM

విద్యార్థులు లేరంటూ మూసివేసిన ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2024 విద్యాసంవత్సరం పునఃప్రారంభంలో బడులు తెరిచేలా చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు ఉండి మూతబడిన స్కూళ్లపై ఆరా తీస్తోంది.

మూత బడులు తెరుచుకునేలా...?

- వివరాలు సేకరించిన విద్యాశాఖ

- జిల్లాలో తెరుచుకోని పాఠశాలలు 50

- ఆర్థిక భారంగా మారుతున్న దూరం

- కళావిహీనంగా సర్కారు పాఠశాల భవనాలు

జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు లేరంటూ మూసివేసిన ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2024 విద్యాసంవత్సరం పునఃప్రారంభంలో బడులు తెరిచేలా చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు ఉండి మూతబడిన స్కూళ్లపై ఆరా తీస్తోంది. ఆయా గ్రామాల్లో పిల్లలు ఉన్నారా....ఎక్కడి పాఠశాలల్లో చదువుతున్నారు.... పాఠ శాలలు తెరిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి. అనే విషయాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. సీఆర్పీలు, గ్రామ కార్యదర్శులు, మండల విద్యా శాఖ అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలున్నా పాఠశాలలు నడపాలని, ఇందుకు అవసరమైన ఉపాధ్యాయులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతీ పంచాయతీకి సర్కారు పాఠశాల ఉండాలనే నిర్ణయంతో మూసివేసిన బడులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల లెక్కలు తీసే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

టీచర్లు ఉన్నా...విద్యార్థులు లేక...

విద్యార్థులు లేకపోవడంతో జిల్లాలో 50 పాఠశాలలు (సున్న పాఠశా లలు ) తాత్కాలికంగా మూతపడ్డాయి. వీటిలో పలు పాఠశాలల్లో టీచర్లు ఉన్నా విద్యార్థులు లేరు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. దీంతో సున్న పాఠశాలల భవనాలు కళా విహీనంగా మారాయి. కొన్ని చోట్ల ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లతో నిండిపో గా మరిన్ని పాఠశాలల భవనాలు అక్రమణాలకు గురైనట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి పాఠశాలలు మూత పడినా టీచర్లు మాత్రం కొనసాగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలకు పిల్లలు వెళ్లి పోయినట్లు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు మూతపడటం వల్ల విద్యార్థులు కిలో మీటర్లుకు పైగా దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. దూరం, ఆర్థిక భారంగా మారుతోంది. కిలోమీటరు లోపు ప్రైమరీ, మూడు కిలో మీటర్ల లోపు అప్పర్‌ ప్రైమరీ, ఐదు కిలో మీటర్ల లోపు హై స్కూల్‌ ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఇందులో భాగంగా గతంలో పాఠశాలలు తెరిచి ఉపాధ్యాయులను కేటాయించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న పరి స్థితుల వల్ల సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య లేకపోవడంతో మూసివేశారు.

సీఎం రేవంత్‌ ఫోకస్‌తో ఆశలు..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల లేని పంచాయతీ, తండా ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటుండడం మూతబడ్డ బడుల పునరుద్ధరణపై ఆశలు పెంచుతున్నాయి. విద్యార్థులు లేరని మూసివేసిన పాఠశాలలు తెరవాలని గత డిసెంబరులో విద్యాశాఖపై నిర్వహించిన స మీక్ష సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశిం చిన విషయం విధితమే. గత ప్రభుత్వ హయాంలో మూసివేసిన పాఠ శాల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. రాష్ట్రంలో ఏ చిన్న గ్రామ మైనా, మారుమూల తండా అయినా పాఠశాల లేకుండా ఉండకూడద న్నారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలను మూసివేయడం సరికాద ని సూచించారు. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో గత నాలుగు నెలలుగా విద్యాశాఖ అధికారులు మూ సివేసిన పాఠశాలల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నాయి.

జిల్లాలో బడులు ఇవే...

జిల్లాలోని బీర్‌పూర్‌ మండలం మంగేళ, రంగసాగర్‌, గంగసముద్రం ప్రాథమిక పాఠశాలలు, బుగ్గారం మండల కేంద్రంలోని ఎస్‌సీ కాలనీ పాఠ శాల, ధర్మపురి మండలం ఎడపల్లి, గుండ్లగూడెం, దోనూర్‌, గోవిందు పల్లి, కొత్తగూడెం, బోయగూడెం, ధర్మపురి ఉర్ధుమీడియం, కోరండ్లపల్లి ప్రాథమి క పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. గొల్లపల్లి మండలం ఇస్రా జ్‌పల్లి ఎస్‌సీ, వెనుగుమట్ల ఎస్‌సీ, బీమ్‌రాజ్‌పల్లి ఎస్‌సీ, దంతూర్‌ ఎస్‌సీ కాలనీ పాఠశాలలు, కోస్నపల్లి, అబ్బాపూర్‌, ఎండపల్లి మండలం గొడిశలపే ట, ఇబ్రహీంపట్నం మండలం కేశాపూర్‌, ఎర్రాపూర్‌, జగిత్యాల పట్టణంలో ని తులసినగర్‌, జగిత్యాల రూరల్‌ మండలంలోని ముదుగ్మంపల్లి, తక్క లపల్లి ఎస్‌సీ, చల్‌గల్‌ ఒడ్డెర కాలనీ, కథలాపూర్‌ మండలం చింతకుంట, కొడిమ్యాల మండలం పోతారం, దమ్మన్నపేట, బుల్లోనిచెరువు పాఠశాలలు విద్యార్థులు లేకపోవడం వల్ల మూతపడ్డాయి. వీటితో పాటు మల్లాపూర్‌ మండలం గుండంపల్లి, వెంకట్రావుపేట, రత్నాపూర్‌, హుస్సేన్‌నగర్‌ ఉర్ధు మీడియం, మల్యాల మండలం కొమ్ముపల్లి, కొత్తపల్లి, మల్యాల ఉర్ధూమీడి యం, మెట్‌పల్లి మండలం రంగారావుపేట, సర్కంపేట, పెగడపల్లి మండ లం కొండాయిపల్లి, రంబాద్రునిపల్లి, రాజారాంపల్లి తండా, కీచులతపల్లి, ఉప్పుపల్లి, రాయికల్‌ మండలం మంగ్యానాయక్‌ తండా, సారంగపూర్‌ మం డలం రంగపేట, వెల్గటూరు మండలం కొత్తపల్లి, కోటిలింగాల, కుమ్మ రిపల్లి, చెగ్యాం ఎస్‌సీ, శాలపల్లి ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవే శాలు లేకపోవడంతో మూతపడ్డాయి.

ప్రభుత్వ నిర్ణయం మేరకే...

- జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యార్థులు లేకపోవడం వల్ల గతంలో మూతబడ్డ పాఠశాలల పునరుద్ధ రణపై ప్రభుత్వ నిర్ణయం మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఇందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించాము. పాఠశాలల పునరుద్ధరణపై దృష్టి సారించాము. ఇందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నాము.

మూతబడ్డ పాఠశాలలు తెరిపించాలి

- తులసి ఆగమయ్య, టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు

జిల్లాలో మూతబడ్డ పాఠశాలలను పునరుద్ధరించాలి. విద్యాహక్కు చ ట్టం ప్రకారం బాల బాలికలకు అందాల్సిన విద్యా లక్ష్యం నెరవేరే విధంగా అన్ని వర్గాలు సహకరించాలి. విద్యతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడు తుంది. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పిల్లలకు అందుబాటులో ఉండే విదంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది. విద్యా ఫలాలు అందరికి అందాలి.

అందరికి విద్య అందించడం బాధ్యతగా బావించాలి

- బైరం హరి కిరణ్‌, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

అందరికి విద్య అందించడం అన్ని వర్గాలు బాధ్యతగా బావించాలి. జి ల్లాలో సున్న పాఠశాలలు ఉండడానికి పలు కారాణాలున్నాయి. వాటిని తి రిగి తెరిపించాల్సిన అవసరముంది. పాఠశాలను మళ్లీ తెరిచి కనీసం ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగే లా ఇంటింటి ప్రచారంతో అవగాహన కల్పించాలి. ఉచిత విద్యను అందరి కి అందుబాటులో ఉంచే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులపై సైతం ఉంటుంది.

Updated Date - May 26 , 2024 | 12:57 AM