Share News

ఆదర్శంగా మార్చాలని...

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:27 AM

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీ లను ఏర్పాటు చేసింది.

ఆదర్శంగా మార్చాలని...

- స్కూళ్లలో వసతుల కల్పనకు శ్రీకారం

- అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు

- జిల్లా వ్యాప్తంగా 4,002 పనుల గుర్తింపు

- రూ. 31.49 కోట్లు నిధులు మంజూరు

జగిత్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీ లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్ప నకు పనులు చేయించేందుకు రూ. 31.49 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే జిల్లాలోని 950 పాఠశాలలు ఉండగా గత ప్రభుత్వం 329 పాఠశాలల్లో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. కొన్ని పాఠశాలల్లో పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు మౌలిక వసతులకు నోచుకోని 788 పాఠశాలలను ఎంపిక చేసిన కొత్త ప్రభుత్వం యూడైస్‌ ఆధారంగా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.

సిద్ధమైన కార్యాచరణ...

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వెంటనే పనులు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇంజనీరింగ్‌ అధి కారుల అంచనా మేరకు స్కూళ్లలో విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు, తరగతి గదుల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 31.49 కోట్లు మంజూరు చేసింది. మొదట తరగతి గదుల్లో విద్యుత్‌, మరుగు దొ డ్లు, మూత్రశాలలు, బాలికల మూత్ర శాలలు, చిన్న, పెద్ద మరమ్మతు లు, సానిటేషన్‌ నిర్వహణ, విద్యుత్‌ బిల్స్‌ తగ్గింపునకు సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు, యూనిఫాం స్టిచ్చింగ్‌ పనులు చేపట్టేందుకు 25 శాతం నిధుల ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి నిర్ణీత మొత్తం చొప్పున నిధులను ఎంపీడీవోల ఖాతాల్లో జమ చేశారు. వాటిని అమ్మ ఆ దర్శ కమిటీ ఖాతాలో జమ చేయనున్నారు. ప్రతి పాఠశాలకు వసతుల కల్పనకు గరిష్టంగా రూ. 14 లక్షల వరకు, కనిష్టంగా రూ. 1.35 లక్షల వ రకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల తీ ర్మానం, కలెక్టర్‌ ఆదేశాలతో పనులు ప్రారంభించడానికి సిద్ధమ వుతున్నారు.

నిధులు విత్‌ డ్రా ఇలా..

పాఠశాలల పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతులు కల్పించ డానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. పనులు ప్రారంభమైన త ర్వాత డబ్బులు తీసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో జాతీయ బ్యాంకులో ఖాతాలను ఇప్పటి కే తెరిపించారు. రూ. 25 వేల లోపు విలువయిన పనులు చేసిన తర్వాత పాఠశాలల్లో కమిటీ సమావేశమై డబ్బులను విత్‌ డ్రా చేయనున్నారు. అ దేవిధంగా రూ. లక్ష వరకు పనులకు ఎంపీడీవో అనుమతితో విత్‌ డ్రా చే యనున్నారు. రూ. లక్ష పైగా విలువైన పనులు చేస్తే జిల్లా సమాఖ్యతో పాటు కలెక్టర్‌ అనుమతి తీసుకొని విత్‌ డ్రా చేయనున్నారు. ఈ నిధుల వినియోగంపై కూడా అన్ని మండలాల్లో అమ్మ ఆదర్శ కమిటీలకు అవ గాహన కల్పిస్తున్నారు. కమిటీల బాధ్యత, పనితీరు, పనుల నిర్వహణ త దితర అంశాలపై నిపుణులైన అధికారులచే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దివాకర సంబందిత శాఖల అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 4,002 పనుల గుర్తింపు...

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గల 788 పాఠశాలల్లో 4,002 పను లను అధికారులు గుర్తించారు. ఇందుకు గాను రూ. 31.49 కోట్లు నిధుల ను డీఎంఎల్‌టీ, ఎస్‌డీఎఫ్‌, ఎన్‌డీఈజీడీల నుంచి కేటాయించాలని అం చనా వేశారు. ఇందులో 1,818 శిథిలావస్థకు గురైన మూత్ర శాలల అభి వృద్ధికి రూ. 6.36 కోట్లు, 724 తాగునీటి అభివృద్ధి పనులకు రూ. 7.24 కో ట్లు, చిన్న చిన్న రిపేర్లకు 461 పనులకు రూ. 9.22 కోట్లు వ్యయం అవు తుందని అంచనా వేశారు. 809 విద్యుత్‌ అభివృద్ధి పనులకు రూ. 2.02 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో గల పాఠశాలల్లో 57 బాలికల మూత్ర శాలల నిర్మాణాలకు రూ. 1.99 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో గల పాఠశాలల్లో 133 బాలికల మూత్ర శాలల నిర్మాణాలకు రూ. 4.65 కోట్లు నిధులు అవసర మవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు పరిపాలన పరమైన అను మతిని ఇస్తూ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా మూడు రోజుల కిత్రం ఉత్త ర్వులు జారీ చేశారు. సాధ్యమైనంత తొందరలో పనులు ప్రారంభించి పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే...

- జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అ వసరమైన కార్యాచరణను ప్రారంభించాము. ప్రభుత్వం జారీ చేసిన మా ర్గదర్శకాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, పనులు గుర్తింపు, నిధుల కేటాయింపు, పనుల ప్రారంభం తదితర వాటిని నిర్వహించడంపై దృష్టి సారించాము.

Updated Date - Apr 19 , 2024 | 01:27 AM