Share News

నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:00 AM

సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు.

నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

గోదావరిఖని, ఏప్రిల్‌ 24: సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు. బుధవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో రామగుండం-1, 2, 3, ఏఎల్‌పీ ఏరియాలకు చెందిన జీఎంలు, ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులతో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత, రవాణాపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాల వారీగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని, సకాలంలో ఓవర్‌ బర్డెన్‌ను తొలగించి బొగ్గు ఉత్పత్తి, రవాణాను త్వరితగతిన చేపట్టాలని కోరారు. యంత్రాలను 100శాతం సామర్థ్యంతో వినియోగించి బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించా రు. ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌, ఆర్‌జీ-2 జీఎం ఎల్‌వీ సూర్యనా రాయణ, ఆర్‌జీ-3 జీఎం సుధాకర్‌రావు, పీఓ చంద్రశేఖర్‌, ఏజెంట్లు బానో తు సైదులు, చిలుక శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:00 AM