Share News

ప్రతీ మండలంలో మూడెకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:32 AM

ప్రతీ మండలంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ ఆడిటోరియంలో అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ప్రతీ మండలంలో మూడెకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

-కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

జగిత్యాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రతీ మండలంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ ఆడిటోరియంలో అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడారు. ఎలాంటి సమస్యల లేని భూమి వివరాల ప్రతిపాదనలను ఆర్‌డీఓలు పరిశీలించి పంపించాలని సూచించారు. ప్రజా పాలనకు సంబందించిన దరఖాస్తులన్నింటిని వేగవంతంగా డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించా లని ఆదేశించారు. వచ్చే వారం రోజుల్లోగా డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. అదేవిదంగా ఈనెల 22వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు నిర్ణీత ఫారాలలో చేసుకోవచ్చన్నారు. గ్రామాలు, పట్టణాలు, కళాశాలల్లో ఓటరు నమోదుకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే నెల 8వ తేదిన ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు. జిల్లాలోని వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి అర్హులైన యువత ఓటరు నమోదు చేసుకునేలా అవగాహణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, దివాకర, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్‌డీఓలు నరసింహమూర్తి, రాజేశ్వర్‌, మధు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

- ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి..

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్బంగా ఆమే మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజల దరఖాస్తులను స్వీకరించడంతో పాటు సాధ్యమైనంత తొందరలో పరిష్కారం చూపాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:32 AM