చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నించిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:09 AM
మండలంలోని భోజన్నపేట, కొత్తపల్లి, మూలసాల గ్రామాల మధ్య హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నిం చిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష డిమాండ్ చేశారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 17: మండలంలోని భోజన్నపేట, కొత్తపల్లి, మూలసాల గ్రామాల మధ్య హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నిం చిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష డిమాండ్ చేశారు. బుధవారం చెక్‌డ్యాంను బీఎస్పీ బృందంతో కలిసి దాసరి ఉష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రధా నంగా కొత్తపల్లి, భోజన్నపేట, మూలసాల గ్రామాల ప్రజలకు ఉపయోగకరమైన చెక్‌డ్యాంను బ్లాస్టింగ్ చేయాలకున్న వారిని గుర్తించాల న్నారు. చెక్‌డ్యాం కూల్చేందు కు కాంగ్రెస్ నాయకులే కుట్రపన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని, వారు ఎంత టి వారైనా అరెస్ట్ చేసేదాకా బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు బొంకూరి దుర్గయ్య, ప్రధానకార్యదర్శి సా తూరి అనిల్, మల్లారపు రవిందన్, బొంకూరి సురేందర్ సన్ని, ఓంప్రకాష్ తదితరు లు పాల్గొన్నారు.