Share News

దేవాలయాలపై దాడులు చేసినవారిని శిక్షించాలి

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:59 AM

హిందూ దేవాలయాలపై దాడులు చేసినవారిని కఠినం గా శిక్షించాలని జగిత్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ నాయకులు కలెక్టర్‌కు వినతిప త్రం అందిం చారు.

దేవాలయాలపై దాడులు చేసినవారిని శిక్షించాలి
రాయికల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న హిందూ సంఘాల నాయకులు

- హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 19 (ఆంద్రజ్యోతి): హిందూ దేవాలయాలపై దాడులు చేసినవారిని కఠినం గా శిక్షించాలని జగిత్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ నాయకులు కలెక్టర్‌కు వినతిప త్రం అందిం చారు. హైదరాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని అన్యమతస్థులు కాలితో తన్నడాన్ని, సదాశివపేటలో హనుమాన్‌ విగ్రహం మొహం, కాళ్లు, చేతులు చెక్కడంలాంటి దుశ్చర్యలకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బోయిన పద్మాకర్‌, గాజోజు సంతోష్‌, మామిడాల రాములు, పాదం మహేం దర్‌, విశ్వ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల (ఆంద్రజ్యోతి): హైదరాబాదులోని ముత్యాల పోచమ్మ దేవాలయంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌, బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పట్టణంలోని నందీ చౌరస్తాలోని నందీ విగ్రహానికి పూజలను నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టె విధంగా చట్టం రూపోందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాతీ య రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణం లోని జాతీయ రహదారి మీదుగా కార్గిల్‌, నందీ చౌరస్తా వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతి ప్రతం అందించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌, భజరం గ్‌ దళ్‌, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

రాయికల్‌(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ముత్యాల మ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాయికల్‌ పట్టణంలో నవదుర్గ, చండీ పరివార్‌, భవాని, సంఘమిత్ర సేవా సమితిల ఆధ్వర్యంలో శనివారం శాంతి యుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, ప్రజలు స్థానిక గాంధీ విగ్రహం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

మెట్‌పల్లి టౌన్‌(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాల యాలను ధ్వంసం చేస్తున్న మతోన్మాదులను శిక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు ఆర్డివో కార్యాలయం లో అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు పోహార్‌ తుక్కారాం, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:59 AM