Share News

ఇది ఫొటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:34 AM

రాష్ట్రంలో పథకాల ప్రభుత్వం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం మాజి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇది ఫొటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం
కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజి మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు

కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజి మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావుతిమ్మాపూర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పథకాల ప్రభుత్వం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం మాజి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని చూస్తే 2001 నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఉద్యమం సమయంలో ధూందాం పేరిట ప్రజలను జాగృతం చేసిన రసమయి బాలకిషన్‌ అలాయ్‌ బలయ్‌ పేరిట తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద పోరాటానికి ఆయుధం సిద్దం చేశాడన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ మీద పోరాటానికి మరో ధూంధాం మొదలు పెట్టె రోజులు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రామాల్లోని రచ్చబండ వద్ద చర్చలు పెట్టాలని, ప్రజలకు, రైతులకు, యువతకు అందరికి అర్థమయ్యే విధంగా వివరించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మానకొండూర్‌లో బీఆర్‌ఎస్‌ వాళ్లే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు.

ఫ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితం ఆశాజనకంగా ఉండదని ముందే తెలుసని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. గెలిస్తే ప్రజల దగ్గరికి ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉండేవాడు రాజకీయ నాయకుడు కాదన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఫ రానున్న స్ధానిక సంస్దల ఎన్నికల్లో మానకొండూర్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం అని ఽమాజి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ధీమా వ్యక్తం చేశారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను చూస్తే ఓడిన తరువాతనే మరింత బాధ్యత పెరిగినట్లనిపిస్తోందన్నారు. పదేళ్లు రైతులను కాపాడుకున్నం కాని కాంగ్రెస్‌ పది నెలల పాలనల్లోనే రైతులకు కన్నీళ్ళు తెప్పించారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఇనుకొండ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:34 AM