మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:34 AM
సమా జ హితం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తి ని ప్రజలంతా కొనసాగిం చినప్పుడే వారి త్యాగాలకు గుర్తింపు వస్తుందని పెద్దప ల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కోరారు.

మంథని, జూలై 4: సమా జ హితం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తి ని ప్రజలంతా కొనసాగిం చినప్పుడే వారి త్యాగాలకు గుర్తింపు వస్తుందని పెద్దప ల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కోరారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్థంతి, సనాతన హిందూ ధర్మ ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతి సంద ర్భంగా స్థానికంగా ఉన్న వారి విగ్రహాలకు పుట్ట మధు గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మహనీయుల స్ఫూర్తిని ప్రజలకు చాటిచెప్పడానికి తాము మంథనిలో దొడ్డి కొము రయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, బీఆర్ అంబేద్కర్, బీపీ మండల్, జ్యోతిబా ఫూలే లాంటి అనేకమంది విగ్రహాలను ఏర్పాటు చేయిం చామన్నారు. వారి ఆశయ సాధన కోసం అందరు కృషి చేసినప్పడే వారికి నిజమైన నివాళుర్పించి నట్లు తెలిపారు. వారి పోరాట స్ఫూర్తితోనే నియో జకవర్గంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యన్నతి, చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
పుట్ట మధుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఆత్మీయ సన్మానం
పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌పుట్ట మధు పదవీకాలం పూర్తి అయిన నేపథ్యంలో మంథని నియోజకవ ర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పుట్ట మధు, ఆయన సతీమణి పుట్ట శైలజను ఆత్మీయంగా సన్మానించారు. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి సహకారంతోనే తాను ఐ దేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసు కున్నట్లు పుట్ట మధు వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.