Share News

సదాశివ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:34 AM

సదాశివ ఫౌండేషన్‌ సేవలు అభినందనీ యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

సదాశివ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 21: సదాశివ ఫౌండేషన్‌ సేవలు అభినందనీ యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. 11 రోజుల క్రితం సదాశివ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని పందిళ్ళ గ్రామాని కి చెందిన ఇల్లందుల శాంతయ్య మృతిచెందగా వారి కుటుంబ సభ్యులు సదాశివ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శాంతయ్య మృతదేహాన్ని కరీంనగర్‌ ప్ర తిమ మెడికల్‌ కళాశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం సదాశివ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పందిళ్ళలో మృతుని కుటుంబ సభ్యుల ను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓదెల మండల కేంద్రానికి చెందిన సదాశివ ఫౌండేషన్‌ 2008నుంచి నేత్రదానం, శరీరదానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరు స్తూ వరంగల్‌, పెద్దపెల్లి జిల్లాల్లో వృత్తుల కుటుంబ సభ్యుల సహకారం తో నేత్రాలు, మృత శరీరాలను ప్రభుత్వ వైద్యశాలలకు అప్పగిస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్‌, సదా శివ ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మెరుగు భీష్మాచారి, ఎంపీటీసీ రావి సదా నందం, మాజీ సర్పంచ్‌ అటికమ్‌ శంకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, నాయకులు మాదాసు సతీష్‌, సబ్బని రా జమల్లు, పోతర వేన మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:34 AM