అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:26 AM
అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో (ప్లాగ్‌డే) భాగంగా సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

- ఎస్పీ అఖిల్ మహాజన్
- ఆయుధాల వినియోగంపై అవగాహన
సిరిసిల్ల క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో (ప్లాగ్‌డే) భాగంగా సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఓపెన్ హౌజ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రేయిన్‌బో, శుభోదయ, సరస్వతి విద్యాలయాల విద్యార్థులకు పోలీసు చట్టాలు, కేసుల ఛేదన, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగా లు, డాగ్, బాంబ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ పరికరాలు, నిబంధనలు, షీటీం, భరోసా సెంటర్, సైబర్ నేరాలు, ఆయుదాలు, సాంకేతిక పరిజ్ఞానం, డయల్ 100, రిసెప్షన్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలకు పోలీస్‌స్టేషన్ ఎలా ఉపయోగపడుతుందని , పోలీసు విధులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతో పాటు అన్నింటిలో అవగాహన కలిగి ఉన్నపుడే సమాజంలో రాణిస్తారన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాలుపంచుకొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏ ఆయుధం ఎలా ఉపయోగపడుతుందని విద్యార్థులకు ప్రదర్శనగా చూపెట్టారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్ సీఐ కె. కృష్ణ, ఆర్‌ఐలు యాదగిరి, రమేశ్, మధుకర్, ఆర్‌ఎస్‌ఐ సాయికిరణ్ పాల్గొన్నారు.