Share News

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:43 PM

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ కొనియాడారు.

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 30: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ కొనియాడారు. అమరుల త్యాగాలు భావితరాలకు తెలియజేయడం మన బాధ్యత అని అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందకు తీసుకెళ్తామనే ధృఢ సంకల్పంతో వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మృత్యర్థం ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరుగుతుందని అన్నారు. భారత స్వాత్రంత్య పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులుగా నిలిచారని, వారి త్యాగాల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పవన్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి

కరీంనగర్‌ అర్బన్‌ : జాతిపిత మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంళవారం ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్ఖానగడ్డలోని గాంధీ విగ్రహానికి టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధన కోసం నేటి యువత పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్‌, పులి ఆంజనేయులుగౌడ్‌, శ్రావణ్‌ నాయక్‌, వెన్న రాజమల్లయ్య, మల్యాల సుజిత్‌కుమార్‌, మల్లికార్జున రాజేందర్‌, పడిశెట్టి భూమయ్య, విక్టర్‌, ముస్తాక్‌, వెన్నం రజిత, రాచర్ల పద్మ, రామిడి రాజిరెడ్డి, సిరిపు రం నాగప్రసాద్‌, వంగల విద్యాసాగర్‌, ఇన్నారెడ్డి, లింగంపల్లి బాబు, అబ్దుల్‌ రహమాన్‌, దీకొండ శేఖర్‌, గడప అజయ్‌, కంకణాల అనిల్‌కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో..

కరీంనగర్‌ టౌన్‌: జాతిపిత మహాత్మగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా పలువురు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు ఏవి మల్లికార్జున్‌, ప్రధాన కార్యదర్శి శివనాథుని శ్రీనివాస్‌, వాసవీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల ఆంజనేయులు, వంగల పవన్‌, కొలిపాక శ్రీనివాస్‌, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్‌, తనుకుసాయికృష్ణ, కొంజర్ల శ్రీకాంత్‌, కన్న సాయి, వైశ్య సంఘం, అభ్యుదయ సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా నివాలులర్పించారు. భగత్‌నగర్‌ రావూస్‌లో మహా త్మాగాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ ప్రభాకర్‌రావు, సీఈవో నితిన్‌రావు, ప్రిన్సిపల్‌ రహమాన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కల్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీధర్‌, ఇట్ట మల్లేశం, ఎస్‌కె హైమద్‌ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:43 PM