సమ్మర్ క్యాంపుల నిర్వహణలో వలంటీర్ల పాత్ర ప్రశంసనీయం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:19 AM
జిల్లాలోని గ్రామీణ ప్రాంతా లలో వేసవి కాలంలో విజయవంతంగా సమ్మర్ క్యాంప్ లు నిర్వహించడంలో వలంటీర్లుగా పనిచేసిన విద్యార్థు లు చేసిన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కొనియాడారు.

పెద్దపల్లిటౌన్, జూన్ 6: జిల్లాలోని గ్రామీణ ప్రాంతా లలో వేసవి కాలంలో విజయవంతంగా సమ్మర్ క్యాంప్ లు నిర్వహించడంలో వలంటీర్లుగా పనిచేసిన విద్యార్థు లు చేసిన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావే శ మందిరంలో సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా క్యాంపులను నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన పిల్లల సందడి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ భారత్ దేఖో బృందం ఆధ్వ ర్యంలో మార్చి 25నుంచి జూన్ 30వరకు 30 గ్రామాల్లో విస్తృతంగా విద్యార్థులు వలంటీర్లుగా పనిచేస్తూ చిన్నా రులకు సమ్మర్ క్యాంపులను విజయవంతంగా నిర్వ హించారన్నారు. ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదని, మానవ జీవితం చాలా స్వల్పకాలం ఉంటుందని,మనం చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని, ఆ దిశగా నేడు వాలం టీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారులకు సమ్మర్ క్యాంపు లను సమర్థవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమని కలెక్టర్ కొనియాడారు. వలంటీర్‌గా సమ్మర్ క్యాంపులు నిర్వహించిన ప్రతి విద్యార్థి దాదాపు 20మంది చిన్నారులపై తమ ప్రభావం చూపారని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి, విద్య ద్వారా మాత్రమే సాధ్యమ వుతుందని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలో ఉన్న అసమానతలను తగ్గిస్తుందన్నారు. ప్రస్తుతం వలంటీర్లు ప్రారంభిం చిన ఈ స్ఫూర్తి కొనసాగే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా లో ప్రతివారం గ్రామీణ ప్రాంతంలో చిన్నారులతో విద్యార్థులు క్యాం పులు నిర్వహించేలా డిస్ట్రిక్ట్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని రూపొందిస్తు న్నామన్నారు. 2011 సమయంలో తాను 2 నెలల పాటు వాలంటీర్ గా పనిచేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తరగతులు తీసుకోవ డం జరిగిందని, ఆ విద్యార్థులతో గడిపిన సమయం, ఆ అనుభవా లు జ్ఞాపకం ఉన్నాయని, అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ విద్యార్థు లకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం వలంటీర్లుగా పని చేసి సమ్మర్ క్యాంపులు నిర్వహించిన విద్యార్థులను సన్మానించి, ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, పాఠశాల అకడమిక్ అధికారి డాక్టర్ పీఎం షేక్, భారత్ దేఖో బృందం సభ్యులు అస్ర ఫాతిమా, గణేష్ గుడల, మహమ్మద్ మెహరీన్, వై.కోమల్, శ్రీవాణి, మీనాక్షి, విద్యార్థు లు, వలంటీర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.