Share News

కూలీలకు పని కల్పించడమే ఈజీఎస్‌ ఉద్దేశం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు నిరుద్యోగ భృతి, చేతినిండా పని కల్పించడమే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ముఖ్య ఉద్దేశమని డీఆర్‌డీవో పీడీ శ్రీధర్‌ అన్నా రు.

కూలీలకు పని కల్పించడమే ఈజీఎస్‌ ఉద్దేశం

ఓదెల, జనవరి 11 : గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు నిరుద్యోగ భృతి, చేతినిండా పని కల్పించడమే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ముఖ్య ఉద్దేశమని డీఆర్‌డీవో పీడీ శ్రీధర్‌ అన్నా రు. గురువారం మండల పరిషత్‌ ఆవరణలో 14వ, విడత ఉపాధిహామీ ప్రజా వేది కను నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ 2022 నుంచి 2023 వరకు గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి పనుల్లో ఈసారి ఎలాంటి తప్పిదాలు లేకుండా పనులు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్లో కొంత వెసు లుబాటు ఉంటుంది కానీ, ఈజీఎస్‌లో అలాంటి వెసులుబాటు ఉండదన్నారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే ప్రజావేదిక ఒక ఆదర్శంగా ఉండాలని, గతంలోని పొరపాట్లు ఇక ఉండవని ఆశించారు. వేసవిలో ఉపాధి పనులకు డిమాండ్‌ ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని 22 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 25 మంది చొప్పున తగ్గకుండా కూలీలకు పని, జాబ్‌ కార్డులు కల్పించాలని కోరారు.

ఎఫ్‌ఏలకు 1.84 లక్షల జరిమానా

మండలంలోని 22 గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లకు తప్పిదాలు, బాధ్యత రహిత్యానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిందుకు 1,84,90రూపాయలు అధికారులు జరిమానా విధిం చారు. అలాగే గతంలోని 13వ విడతలో భారీగా జరిమానాలకు గురైన వారు మిగ తా డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, విజిలెన్స్‌ అధికా రి పంజాల కొమురయ్య, అంబుడ్స్‌మెన్‌ జిల్లా అధికారి శరత్‌ కుమార్‌, ఎంపీడీవో సత్తయ్య, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, స్టేట్‌రిసోర్స్‌పర్సన్‌ రవి, నాగరాజు, జీవన్‌, పాం డురంగ, డీఆర్పీలు సురేష్‌, సంజీవ్‌, రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM