Share News

పదేళ్ల పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:08 AM

ఎందరో పోరాటాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ లో పదేళ్ల పాలనలో ప్రజలకు న్యాయం జరుగలేదని తెలంగాణ జన సమితి అధ్య క్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు.

పదేళ్ల పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు

గోదావరిఖని, ఏప్రిల్‌ 7: ఎందరో పోరాటాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ లో పదేళ్ల పాలనలో ప్రజలకు న్యాయం జరుగలేదని తెలంగాణ జన సమితి అధ్య క్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నియామకాల నినాదం గాలికి వదిలేశారని, కొద్ది మందికే సంపద మిగిలిందని, నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మి కుల పాత్ర మరిచిపోలేనిదని, 45రోజుల పాటు సమ్మె చేసి దేశ వ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కల్పించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనైనా తెలం గాణ సస్యశ్యామలం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సింగరేణి కార్మికులకు ఫేస్‌వర్క్‌పై అలవెన్సులు చెల్లించాలని, కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గులో లాభాల వాటాపై 40శాతం లాభాల వాటా ఇవ్వాలని, ఓపెన్‌కాస్టులతో కాలుష్యం వెదజల్లు తుందని, వీటి స్థానంలో భూగర్భ గనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, మెడికల్‌ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు 80శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, సొంతింటి పథకం ద్వారా ఇల్లు ఇవ్వాలని, పదవీవిరమణ పొందిన కార్మికులకు రూ.20లక్షల హెల్త్‌ కార్డు, కార్మికులకు రూ.20లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని, కార్మికులు పని చేసేచోట నాణ్యమైన పనిముట్లను సమకూర్చాలని, కార్మికులందరికి క్యాడర్‌ స్కీం ఐదు సంవత్సరాలకు కుదించి అమలు చేయాలని, డిస్మిస్‌ కార్మికులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రామగుండం రీజియన్‌ కమిటీ అధ్యక్షులు కామెర గట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు గురిజాల రవీందర్‌రా వు, సీనియర్‌ జర్నలిస్టు ఎండీ మునీర్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్‌ అ హ్మద్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ్‌, రాములు, ఈదునూరి నరేష్‌, దేవి సత్యం, కనకయ్య, శేఖర్‌, వెంకటేషం, కుమార్‌, భీమయ్య, రాయలింగు, రాయ పోషం, సలీంబేగ్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:08 AM