Share News

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:07 AM

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
పీహెచ్‌సీలో రికార్డులను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

- సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

- కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

- నేరెళ్ల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

తంగళ్లపల్లి, ఆగస్టు 23: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాబ్‌, ఫార్మసీ, వ్యాక్సిన్లు, ఓపీ, కాన్పుల రిజిస్టర్‌, వ్యాక్సిన్‌ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఓపీకొ ఎంత మంది వచ్చారు? పీహెచ్‌సీలో ఈ నెలలో ఇప్పటిదాకా ప్రసవాలు ఎన్ని చేశారు? కుక్క కాటు, డెంగ్యూ టెస్ట్‌ కిట్లపై ఆరా తీశారు. శుక్రవారం 15 మంది ఓపీకి వచ్చారని వారిలో ఇద్దరికి రక్త పరీక్షలు చేశామని, ఈ నెలలో 19 కాన్పుల లక్ష్యం కాగా, పది పూర్తి చేశామని, టెస్ట్‌ కిట్లు, వ్యాక్సిన్‌లు ఉన్నాయని డాక్టర్‌ రేఖ కలెక్టర్‌కు వి వరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలని, ఇక్కడే అన్ని పరీక్షలు, వైద్యం అందించాలని సూచించారు. హాస్పిట ల్‌ ఆవరణలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధు లు, డెంగ్యూ, మలేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టి టెస్ట్‌లు, మెడిసిన్‌ అందించాలని సూచించారు. హాస్పిటల్‌కు కావాల్సిన కిట్లు, మందులు ఏమైనా అవసరం ఉంటే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

- విద్యార్థులతో నిత్యం ప్రాక్టీసు చేయించాలి...

విద్యార్థులతో నిత్యం చదవడం, రాయడం, ప్రశ్నలకు జవాబులు చెప్పేలా ప్రాక్టీసు చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయం ఆవరణ, వంట సామగ్రి స్టోర్‌ రూం, కిచెన్‌ పరిశీలించారు. మెనూ ప్రకారం ఏ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారో పరిశీ లించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివిం చి, పాఠాలు బోధించారు. మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌, బయో సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేశారు. టీచర్లు పాఠాలు బోధిస్తున్నప్పుడే విద్యార్థులు నోట్స్‌ రాసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో పీజీసీఆర్‌టీ సంతోషిణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:07 AM