Share News

నేతన్నలకు ఉపాధిని కల్పించాలి

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:37 AM

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆసాములు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిని కల్పించాలని ఈ నెల 11న సిరిసిల్లలో రాస్తారోకో చేస్తామని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ తెలిపారు.

నేతన్నలకు ఉపాధిని కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మూషం రమేష్‌

- సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌

సిరిసిల్ల రూరల్‌, మార్చి 8: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆసాములు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిని కల్పించాలని ఈ నెల 11న సిరిసిల్లలో రాస్తారోకో చేస్తామని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ తెలిపారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మరమగ్గాల, అనుబంధ రంగాల యూనియన్‌ ముఖ్య నాయకులతో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో వష్ట్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులపై చర్చించారు. ఉపాధి సమస్యను పెద్దఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికి పనులు కల్పించేందుకు భవిష్యత్తు పోరాట కార్యచరణ రూపోందించామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11న సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మరమగ్గాలు, అనుబంధరంగాల కార్మికులతో కలిసి రాస్తారోకో చేపట్టాలని నిర్ణయించా మని రమేష్‌ ప్రకటించారు. కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని రమేష్‌ కోరారు. సమావేశంలో నాయకులు నక్క దేవదాస్‌, సిరిమల్ల సత్యం , ఉడుత రవి, కుమ్మరికుంట కిషన్‌, బెజుగం సురేష్‌, ఓగ్గు గణేష్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:37 AM