ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఆలోచన సరికాదు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:21 AM
రాష్ట్రంలోని జలాశయాల న్నింటిలో నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ సరికొత్త ఆలోచన మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను విరమించు కోవాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్య క్షుడు పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 28: రాష్ట్రంలోని జలాశయాల న్నింటిలో నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ సరికొత్త ఆలోచన మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను విరమించు కోవాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్య క్షుడు పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ లోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతిని ధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకులతో కూడి న ప్రతినిధుల బృందంతో కలిసి ఆదివారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని, అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక, పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయా లను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు. ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియో గించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు ఆటంకాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపం చంలోని అభివృద్ధి చెందిన దేశాలలో జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువలపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ను నెలకొలుపుతున్నారని ఈ టెక్నాలజీ రాష్ట్రంలో కూడా అనుసరిం చాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కన కయ్య ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ముదిరాజ్, మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన తదితరులు పాల్గొన్నారు.