ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:23 AM
ప్రజా సమస్యలను పరిష్కారించడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. అదివారం మండల కేంద్రంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు.

చిగురుమామిడి, జూన్ 16: ప్రజా సమస్యలను పరిష్కారించడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. అదివారం మండల కేంద్రంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనకు ప్రజా సేవ చేయడానికి చక్కటి అవకాశం ఇచ్చారని, తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు విని పరిష్కారిస్తానని అన్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే విధంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలందిస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ గీకురు రవీందర్, కాంగ్రెస్ నాయకులు చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారయణరెడ్డి, సాంబారి బాబు, కర్ణకంటి మంజులారెడ్డి, ముప్పిడి దేవేందర్‌రెడ్డి, పోలు స్వప్న, పచ్చిమట్ల లక్ష్మి, ఓరుగంటి భారతిదేవి, రాములు పాల్గొన్నారు.