ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:54 PM
లోక్‌సభ ఎన్నికల్లో వినియో గించే ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేష న్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశామని కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ అన్నారు.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 3: లోక్‌సభ ఎన్నికల్లో వినియో గించే ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేష న్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశామని కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ లతో కలిసి ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమై జేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వ ర్యంలో జరుగుతుందన్నారు. ఈవీఎం యంత్రాల ర్యాం డమైజేషన్ మొదటి దశలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించడం జరుగు తుందని, రెండవ దశలో ఈవీఎం యంత్రాలను రిటర్నింగ్ అధికారి పోలింగ్‌కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారన్నారు. పెద్దపల్లి అసెం బ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260పోలింగ్ కేంద్రా లకు ప్రస్తుతం ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరుగుతుం దని వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అసెం బ్లీ సెగ్మెంట్ పరిధిలో మనకు అవసరం ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు కంటే 25 శాతం అదనంగా, వీవీ ప్యాట్‌లు 40 శాతం అదనంగా కేటాయించడం జరుగుతుందని, వీటిని కలిపి ర్యాండమై జేషన్ చేసామని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ చేశామని ఆయన పేర్కొన్నారు. మొదటి ర్యాండమైజేషన్ సంబంధించి హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు అందించారు, ఈ.వీఎంలు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్‌రూంకు తరలించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరవుతున్న నేప థ్యంలో నామినేషన్ సమయంలో పాటించాల్సిన నియమ, నిబంధన లు, ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదు మార్గదర్శకాలు, గరిష్ఠ ఎన్ని కల ప్రచార ఖర్చు పరిమితి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గుర్తిం చిన స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చు నమోదు మార్గదర్శకాలను కలెక్టర్ వివరించారు. హెలిపాడ్ కోసం అనుమతులను జిల్లా ఎన్నిక ల అధికారి, పార్లమెంటు స్థాయిలో వినియోగించే వాహనాలకు రిట ర్నింగ్ అధికారి, జిల్లాలో వినియోగించే వాహనాలకు జిల్లా ఎన్నికల అధికారి అనుమతి ఇస్తారని,స్టార్ క్యాంపెయినర్ల ప్రచార సమయం లో వారు వినియోగించే వాహనాల ఖర్చు పార్టీ పరిధిలో జమ చే యడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ డివిజనల్ అధికారులు బీ గంగయ్య, వీ హనుమానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత పాల్గొన్నారు.