Share News

ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:49 AM

ప్రైవేటు కళాశాలు, పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
సిరిసిల్లలో రౌండ్‌ టెబుల్‌ సమావేశంలో పాల్గొన్న నాయకులు

సిరిసిల్ల రూరల్‌, మే 25: ప్రైవేటు కళాశాలు, పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ పార్టీ కార్యాలయం లో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థలపై నిర్వహించిన రౌండ్‌ టెబుల్‌ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేటు కార్పోరేట్‌ విద్యాసంస్థలల్లో ఫీజుల నియంత్ర చట్టం లేకపోవడం వలన యాజ మాన్యాలు విచ్చలవిడిగా ఫీజులను వసూళ్లు చేస్తున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడిపిస్తూ అనుమతులు లేని పాఠశాలలు కూడా జిల్లాలో కూడా ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల అవరణ లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, టై, బెల్ట్‌, ఇతర సామగ్రిని అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రతీ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజు లు నోటీస్‌ బోర్డులో పెట్టడం లేదన్నారు. చాలా ప్రైవేటు కార్పోరేట్‌ పాఠశాలలు ఇంటర్నేషనల్‌, ప్లేస్కూల్‌, డీజీ, సీబీఎస్సీ, లీడ్‌, కరికులం పేరుతో తోక పేర్లు పెడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అరోపించా రు. ఇప్పటికే జిల్లాలోని విద్యాసంస్థల ప్రారంభంలో చాలా పాఠశాలలకు అనుమ తి లేకుండా సమ్మర్‌ క్యాంపుల పేరిట అడ్మిషన్లు చేస్తూ తరగతులు నిర్వహిస్తు న్నారని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ తోపాటు విద్యాశాఖల అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్‌, మల్లా రపు ప్రశాంత్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాంతుల మహేష్‌, మల్లా రపు అరుణ్‌కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్ల కార్యదర్శి అంగూరి రంజిత్‌, భీమ్‌ అర్మీ జిల్లా అధ్యక్షుడు దోబ్బల ప్రవీణ్‌కుమార్‌, లంబాడి ఐక్యవేధిక అధ్యక్షుడు బానోత్‌ నరేష్‌, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జూ లపల్లి మనోజ్‌, కుర్ర రాకేష్‌, అదిత్య, రాజు, వేణు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:49 AM