Share News

ముగిసిన జాతర

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:24 AM

ధర్మపురి గోదావరి నదీ తీరాన జరిగే సమ్మక్క -సారలమ్మ జాతరా ఉత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజైన శనివారం సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగినినట్లు అయింది.

ముగిసిన జాతర

చివరి రోజు వన ప్రవేశం చేసిన ఆడవి బిడ్డలు

భారీ సంఖ్యలో దరించుకున్న భక్తులు

ధర్మపురి, ఫిబ్రవరి 23: ధర్మపురి గోదావరి నదీ తీరాన జరిగే సమ్మక్క -సారలమ్మ జాతరా ఉత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజైన శనివారం సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగినినట్లు అయింది. నాలుగు రోజులుగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా దీవించూ తల్లీ అం టూ అమ్మవారలను వేడుకున్నారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ ఐ ఉదయ్‌కుమార్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంగి సత్యమ్మ, దేవస్థానం మాజీ ధర్మకర్త ఇనుగంటి వేంకటేశ్వర్‌ రావు, లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్‌, ఉత్సవ కమిటీ అధ్య క్షులు శంకర్‌రాజు, ఉపాధ్యక్షులు అలకొండ చంద్రయ్య పాల్గొన్నారు.

జగిత్యాలరూరల్‌: జగిత్యాలరూరల్‌ మండలంలోని పొలాస నర్సింహు ల గుట్టపై సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలను చివరి రోజు ఘనం గా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లిం చుకున్నారు. నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద బలిహరణము కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవార్లకు తులా భారాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఈ ఆధ్వర్యంలో భక్తులకు వసతు లు, సేవలు కల్పించారు. ఆలయకమిటీసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

జగిత్యాల (గొల్లపల్లి): గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్‌ గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆడవి దేవతలను వన ప్రవేశం చేయించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద నిలువెత్తు నల్ల బంగారం(బెల్లం) సమ ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమీటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

వెల్గటూర్‌: వెల్గటూర్‌, స్తంభంపెల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న శ్రీ స మ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాలకు శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉదయం వేళలో వివిధ గ్రామాల నుంచి చేరుకున్న భక్తులు అమ్మవారలకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు నిలువెత్తు బంగారం నెత్తి మీద పెట్టుకుని తులాభారం వేయించారు. భారీగా తరలి వచ్చిన భ క్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దెల చుట్టు ప్రదక్షిణాలు చేసి బంగారం సమర్పించారు. పోలీసులు బందోబస్తు నిర్వ హించారు. ఉత్సవ కమిటీ చైర్మెన్లు దండుగుల రాములు, రాంచంధర్‌ గౌడ్‌ ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెగడపల్లి: మండలంలో వనదేవతల జాతర శనివారం ముగిసింది. నాలుగురోజులుగా జరుగుతున్న సమ్మక్క సారలక్కల జాతర ఉత్సవాలు శనివారం భక్తుల మొక్కుల అనంతరం వనానికి తరలడంతో వనదే వతల పండుగ ఘనంగా ముగిసింది.

Updated Date - Feb 25 , 2024 | 12:24 AM