జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసేదిలేదు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:19 AM
జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసేదిలేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఎలిగేడు, జనవరి 28 : జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసేదిలేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఆదివారం రూ.36లక్షలతో నిర్మించిన రైతు వేధిక, గ్రామ పంచాయతీ బిల్డింగ్ రూ.22లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్, రూ.20లక్షలు వైకుంఠదామం రూ.12లక్షలు సిగ్రీగేషన్ షెడ్ రూ.3.40లక్షలు, గ్రంథాలయం రూ.1.20 లక్షలు, వాటర్‌ప్లాంట్ రూ.1,20 వెచ్చించి నిర్మించిన వాటిని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావుతో కలిసి ప్రారంభించారు. జిల్లా పరిష త్ ఉన్నతపాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్‌ను ఆయన పరిశీలించారు. సుల్తాన్‌పూర్ గ్రామం మంచి అభివృద్ధి సాధించి మిగిలిన గ్రామాలకు ఆదర్శ వంతంగా నిలిచిందని, పట్టుదలతో వివిధ రంగాలలో మంచి పురోగతి సాధించడం అభినందనీయమని మంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించి ఆదర్శ వంతంగా నిలిచిన సుల్తాన్‌పూర్ గ్రామపంచాయతీ పాలక మండలికి గ్రామప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సాధించారని, పాఠశాలల్లో సైతం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తు న్నారని, రీడింగ్ రూమ్ ఏర్పాటుచేసి అందరు చదివేలా చర్యలు తీసుకోవడం వంటి మంచి కార్యక్రమాలను అమలుచేస్తూ సుల్తాన్‌పూర్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గ్రామపంచాయతీ భవనం నుంచి శివపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి అవసర మైన నిధులు పంచాయతీ శాఖ మంత్రితో మాట్లాడి మంజూరు చేసేలా కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తాన్‌పూర్ పాత రోడ్డు బీజీ రోడ్డు వేయాలని, గ్రామపంచాయతీ నుంచి శివపల్లి వరకు రోడ్డు నిర్మా ణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో సైతం ఐటీ పరిశ్రమల అభివృద్ధి జరిగే విధంగా మంత్రి చొరవ తీసుకుని స్థానిక యువతకు ఉపాధి లభించేలా పెద్దపల్లికి పరిశ్రమలు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు, సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రేణుక పీఏసీఎస్ చైర్మన్ గోపు విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీవో అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.