కూలిపోయిన వంతెనను పునర్నిర్మించాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:13 AM
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగా మలో రెండేళ్ల క్రితం గోదావరి వరదలతో కూలిపోయిన వంతెనను పునః నిర్మాణం చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు సింగరేణి యా జమాన్యాన్ని డిమాండ్ చేశారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 17: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగా మలో రెండేళ్ల క్రితం గోదావరి వరదలతో కూలిపోయిన వంతెనను పునః నిర్మాణం చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు సింగరేణి యా జమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కూలిపోయిన వంతెనను సీపీఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా కూలిపోయిన వంతెనను అప్పటి ఎమ్మెల్యే చందర్, ఎంపీ వెంకటేష్‌నేత సందర్శించి వంతెన పునర్నిర్మాణం చేపడుతామని చెప్పి ఏడాది అయినా ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదన్నారు. వంతెన కు నిధులు మంజూరు చేసినప్పటికీ ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదని వారు మున్సిపల్, సింగరేణి అధికారులను ప్రశ్నించారు. పొలాలకు వెళ్లే రైతులు, స్మశానానికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వంతెనను నిర్మించేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయ కులు తొడుపునూరి రమేష్, తాళ్లపల్లి మల్లయ్య, గుంపుల కుమారస్వామి, జైపాల్‌రెడ్డి, కల్వల జగన్ ఉన్నారు.