ముగిసిన ప్రచారం
ABN , Publish Date - May 12 , 2024 | 01:46 AM
ప్రచారం ముగిసింది. మైకులు మౌనం దాల్చాయి. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ , బీజేపీ ప్రచారం హోరేత్తాయి. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో పోటాపోటీగా బైక్ ర్యాలీలు, ప్రచారం నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో మూడు పార్టీల తరపున అగ్రనేతలు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున వేములవాడలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

- సభలు, సమావేశాలకు బ్రేక్
- ఇక తెరచుకోనున్న మూటలు, మద్యం
- చివరి రోజు పోటాపోటీగా ప్రచారం
- కనిపించని ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రచారం ముగిసింది. మైకులు మౌనం దాల్చాయి. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ , బీజేపీ ప్రచారం హోరేత్తాయి. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో పోటాపోటీగా బైక్ ర్యాలీలు, ప్రచారం నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో మూడు పార్టీల తరపున అగ్రనేతలు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున వేములవాడలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల ప్రచారానికి వచ్చారు. జనసభలో ప్రసంగించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ తరపున మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సిరిస్లిలకు బస్సు యాత్ర ద్వారా వచ్చి రోడ్ షో నిర్వహించారు. వీరితోపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీష్‌రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేశారు.
మూటలు.. మద్యం
ఎన్నికల ప్రచారం 48 గంటల ముందే ముగిసి పోయింది. మిగిలిన సమయాల్లో ఇక ఓటర్లను ఆకట్టుకోవడానికి సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో డబ్బుల పంపిణీ, మద్యం సరఫరా, దావత్‌లకు తెరలేపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోల్ మేనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కనిపించని స్వతంత్రులు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ తరపున పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రచారం చేశారు. నియోజకవర్గం పరిధిలో 28 మంది బరిలో ఉన్నా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సిరిసిల్ల, వేములవాడలో మచ్చుకు కూడా కనిపించలేదు. ప్రచారం ముగియడంతో సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్‌లలో ప్రచారం ముగియడంతో ఒక్కసారిగా నిశబ్ధ వాతావరణం అలుముకుంది.