Share News

కార్మిక సంఘాల ఆగ్రహం

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:59 PM

ప్రొడక్షన్‌ డే విషయంలో అధికారు లు, ఏఐటీయూసీ తీరును నిరసిస్తూ ఓసీపీ-3 ఫస్ట్‌షిఫ్టులో కార్మికులు సీఐటీయూ, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూ సీ నాయకులతో కలిసి నిరసనకు దిగారు.

కార్మిక సంఘాల ఆగ్రహం

యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 7: ప్రొడక్షన్‌ డే విషయంలో అధికారు లు, ఏఐటీయూసీ తీరును నిరసిస్తూ ఓసీపీ-3 ఫస్ట్‌షిఫ్టులో కార్మికులు సీఐటీయూ, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూ సీ నాయకులతో కలిసి నిరసనకు దిగారు. యాజమాన్యంతో ఏఐటీయూసీ కుమ్ముక్కై కార్మికుల ప్రయోజనా లను పట్టించుకోలేదని నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొడక్షన్‌ డే అని నోటీస్‌ బోర్డులో యాజమాన్యం నోటీస్‌ ఉంచాల్సింది పోయి, ఏఐటీ యూసీ నాయకులు కార్మికులకు చెప్పడం ఎక్కడి పద్ధతి అని ప్రశ్నించా రు. కార్మికులతో చర్చించి ప్రోత్సాహకాలు ఇస్తామనే హామీ మేరకు గతం లో లంచ్‌ విరామంలో నడిపినట్టు, ప్రస్తుతం అటువంటి ప్రోత్సాహకాలు లే కుండా నడపడానికి ఏఐటీయూసీ నాయకులు ఎలా ఒప్పు కుంటారని ప్రశ్నించారు. లంచ్‌ విరామం లేకుండా నడపడానికి అంగీకరించని కార్మి కులను ట్రాన్స్‌ఫర్లు చేస్తామని,పాత చార్జిషీట్లు వెలికితీసి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఏఐటీయూసీ నాయకులు బెదిరించడాన్ని ఖం డిస్తున్నట్టు ఉల్లి మొగిలి, సత్యనారాయణరెడ్డి, పెండెం సత్యనారాయణలు పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచే యడం మరిచి ఏఐటీ యూసీ నాయకులు కార్మికులపై జులుం ప్రదర్శిం చడం సరికాదన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:59 PM