చివరి ఆయకట్టుకు సాగు నీరందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:41 AM
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు.

ధర్మారం, జూన్ 11 : చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. మంగ ళవారం ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలోని మ్యాదరి కండి చెరువు నిర్మాణ ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ధర్మపురి నియోజకర్గంలోని రైతులు సాగు చేసుకుంటున్న చివరి ఆయకట్టుకు సాగు, తాగు నీరందించే విషయంలో గతంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించానని, సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. అదేవిధంగా ధర్మారం మండలం పత్తిపాక రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న కొత్తపల్లి మ్యాదరి కండి చెరువు నిర్మాణానికి గత ప్రభుత్వ రూ.16కోట్లు మంజూరుచేయగా అందులో రూ.6కోట్ల వరకు పనులు చేశారని అధికా రులు నివేదించారని ఆయన తెలిపారు. ఈ చెరువు కింద దాదాపు 185నుంచి 200 ఎకరాలకు సాగు నీరంది మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. పత్తిపాక రిజర్వా యర్, మ్యాదరికండిచెరువు నిర్మాణాల మిగులు పనుల కోసం నిధులు మంజూరుకు సీఎం రెవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిసి వివరిస్తానని ఆయన చెప్పారు. త్వరలోనే ధర్మపురి రోళ్లవాగు పనులను పూర్తిచేసి ధర్మపురి రైతాం గానికి సాగు నీరందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, తహ సీల్దార్ రజిత తదితరులు ఉన్నారు.