Share News

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:16 AM

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించా రు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 18 : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించా రు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈనెల 25 నుంచి మే 2వరకు జరిగే ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు సజా వుగా నిర్వహించేందుకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఓపెన్‌ పది తరగతి పరీక్షల నిర్వహణ కోసం 2 కేంద్రాలు, ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వర కు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలుచేయాలని, డిప్యూటీ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా తనిఖీలు నిర్వహించాలని, ప్రశ్న పత్రాల తరలింపు, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాల ని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల ని, పరీక్షల సమయంలో విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి కల్పన, పెద్దపల్లి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, పోలీస్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:16 AM