Share News

రాజీవ్‌ గాంధీతోనే దేశంలో సాంకేతిక విప్లవం

ABN , Publish Date - May 22 , 2024 | 12:19 AM

రాజీవ్‌ గాంధీతోనే దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది పడిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా

రాజీవ్‌ గాంధీతోనే దేశంలో సాంకేతిక విప్లవం

కరీంనగర్‌ అర్బన్‌, మే 21: రాజీవ్‌ గాంధీతోనే దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది పడిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని రాజీవ్‌గాంధీ పరితపించారన్నారు. దేశ సమగ్రత, ఐకమత్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 18 సంవత్సరాలు వయస్సు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ఆయన చేసిన సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, నేడు రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్‌చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌, మహిళా కాంగ్రెప్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, నాయకులు పులి ఆంజనేయులు గౌడ్‌, శ్రావణ్‌ నాయక్‌, మడుపు మోహన్‌, సిరాజ్‌హుస్సేన్‌, ఆకారపు భాస్కర్‌ రెడ్డి, వెన్న రాజ మల్లయ్య, బొబ్బిలి విక్టర్‌, కల్వల రాంచందర్‌, ముస్తాక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:19 AM