Share News

టీబీజీకేఎస్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:57 PM

సింగరేణి కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అనేక హక్కులు సాధించిన టీబీజీకేఎస్‌లో పెద్ద ఎత్తున సభ్యులుగా నమోదు కావాలని యూనియన్‌ స్టీరింగ్‌ కమి టీ చైర్మన్‌ మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

టీబీజీకేఎస్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం

గోదావరిఖని, ఏప్రిల్‌ 2: సింగరేణి కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అనేక హక్కులు సాధించిన టీబీజీకేఎస్‌లో పెద్ద ఎత్తున సభ్యులుగా నమోదు కావాలని యూనియన్‌ స్టీరింగ్‌ కమి టీ చైర్మన్‌ మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికులను భాగస్వామ్యం చేయటంలో కీలకపాత్ర పోషించామని తెలిపారు. పిడికెడు మందితో ప్రారం భమై అంచలంచెలుగా ఎదిగి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా నిలిచిన ఘన చరిత్ర కలిగిన టీబీజీకేఎస్‌దని వివరించారు. కార్మిక హక్కుల సాధన కోసం పోలీసు కేసులను, జైలు జీవితాన్ని అనుభవించిన బలమైన నాయకులు కలిగిన యూనియన్‌ను ఆద రించాలని ఆయన కోరారు. సింగరేణి పరిశ్రమ విస్తరణకు, నూతన ఉద్యోగాల కల్పనకు, సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల తవ్వకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జరిపే పోరాటంలో కార్మికులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవీం దర్‌, ఎల్‌ వెంకటేష్‌, జహీద్‌ పాషా, చెల్పూరి సతీష్‌, పోలాడి శ్రీనివాస రావు, కోండ్ర అంజయ్య, చల్ల రవీందర్‌ రెడ్డి, కొయ్యడ రమేష్‌, మహ మ్మద్‌ ఘని, జనగామ మల్లేష్‌, మహేందర్‌, తిరుపతి, భాస్కర్‌, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:57 PM