Share News

రెండు నెలల నుంచి కూలి డబ్బుల చెల్లింపు నిలిపివేత

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:27 AM

ఓదెల మండల కేంద్రంలోని ఈజీఎస్‌ కార్యాలయం ఎదుట కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు జాబ్‌ కార్డులతో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

రెండు నెలల నుంచి కూలి డబ్బుల చెల్లింపు నిలిపివేత

ఓదెల, ఏప్రిల్‌ 5 : ఓదెల మండల కేంద్రంలోని ఈజీఎస్‌ కార్యాలయం ఎదుట కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు జాబ్‌ కార్డులతో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు విలేకరులతో మాట్లాడుతూ తాము రెండు నెలల క్రితం ఉపాధి పనులు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు కూడా డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. ఈ విషయంలో అధికారులకు తెలిపినా కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఎంత పని చేసినా కూడా 170 నుంచి 180 రూపాయల వరకు చెల్లిస్తున్నారని, కనీసం చేసిన పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, అలాగే కూరగాయల ధరలు కూడా అధికంగా పెరిగాయని, వీటికి అనుగుణంగా చేసిన ఉపాధి పనికి తగ్గ డబ్బులు చెల్లించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు 300 రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారో కూలీలకు తెలపాలని కోరారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, మాజీ ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయా లకు సెలవు కావడంతో కూలీలు నిరసన వ్యక్తం చేసి వెనుదిరిగి వెళ్లారు.

Updated Date - Apr 06 , 2024 | 12:27 AM