Share News

విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:05 AM

విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె రామకృష్ణ అన్నారు.

విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

గణేశ్‌నగర్‌, జనవరి 10: విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె రామకృష్ణ అన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో మై భారత్‌ వికసిత భారత్‌ 2047 అనే అంశంపై జిల్లాస్థాయి ఉపాన్యాస పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ స్థానంలో ఈషా పార్వేజ్‌, ద్వితీయ స్థానంలో టి శివశంకరసాయి, తృతీయ స్థానంలో టి రోషిణి నిలిచారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రాం అధికారి బి రవీందర్‌, డాక్టర్‌ కె శారద, డీడీ నాయుడు, పి రాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:05 AM