Share News

విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధించాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:24 AM

పాఠ్యాంశాల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచేలా విద్యా బోధన జరగాలని డీఈవో డి.మాధవి అన్నారు.

విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధించాలి

జ్యోతినగర్‌, జనవరి 31 : పాఠ్యాంశాల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచేలా విద్యా బోధన జరగాలని డీఈవో డి.మాధవి అన్నారు. గత ఐదు రోజులుగా ఎన్టీపీసీ టీటీఎస్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రయోగాల శిక్షణా తరగతులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిఽథిగా హాజరైన డీఈవో మాధవి మాట్లాడుతూ జీవశాస్త్ర ప్రయో గాల ప్రయోగాల ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధన చేయడం లో భాగంగా సైన్స్‌ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం పెరుగుతుందని, తద్వారా మంచి ఫలితా లు వస్తాయని పేర్కొన్నారు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ప్రయోగ దీపికల, సర్టిఫికెట్లను అందజే శారు. జిల్లా విద్యా శాఖ, తెలంగాణ జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఎంవో పి.ఎం.షేక్‌, హెచ్‌ఎం. జయరాజు, సైన్స్‌ అకాడమి అధికారులు డాక్టర్‌ ఎస్‌.రేవతి, అమీర్‌ అలీ, తెలంగాణ జీవశాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజనీకుమార్‌, నరేష్‌, పలువురు ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:25 AM