విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:31 AM
జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థులకు మెరుగైన విద్య అందించేందు కు ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

మంథని, జూలై 4: జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థులకు మెరుగైన విద్య అందించేందు కు ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంథని పట్టణంలోని, మండలంలోని ఎక్లాస్‌పూర్, గద్దలపల్లి, బిట్టుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠ శాలను, పీహెచ్‌సీ, అంగన్‌వాడి కేం ద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చే శారు. ప్రభుత్వ పాఠశాలలోనీ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యా ర్థుల విద్యా ప్రమాణాలను స్వయంగా పరీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాల న్నారు. ఏక్లాస్‌పూర్‌లోని జడ్పీ హెచ్‌ఎస్‌లో గ్రౌం డ్‌లో నీరు నిల్వ ఉండకుండా పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో పెండింగ్ ప నుల వివరాలు, ప్రతిపాదనలు రూపొందించి స మర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచిం చారు. అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామంలో గర్భిణు లను 100 శాతం ఏఎన్‌సీ, రిజిస్ట్రేషన్ చేసి, రెగ్యు లర్ పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. బిట్టుపల్లి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సరఫ రా, లైట్లు,ఫ్యాన్ సౌకర్యం కల్పించాలన్నారు.
పారిశుధ్యంపై సమీక్ష..
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ ప్లాస్టిక్ కవర్లు కనిపించవద్దని కలెక్టర్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యద ర్శులు, సంబంధిత అధికారులతో పారిశుధ్య నిర్వ హణ, వనమహోత్సవం కార్యక్రమం తదితర అం శాలపై గురువారం సమీక్షించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశు భ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణ, పచ్చద నం పెంపొందించడంపైన ప్రధాన దృష్టి సారిం చాలన్నారు. గ్రామాలలో సింగిల్ యూసేజ్ ప్లాస్టి క్ వాడకాన్ని నిషేధించేలా చూడాలన్నారు.
గ్రామాల్లో ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి డంప్‌యార్డ్‌కు తరలించాలన్నారు. గ్రా మాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను రెగ్యులర్‌గా శుభ్రం చేయాలన్నా రు. వన మహోత్సవం కార్యక్రమం కింద గ్రామా ల్లో నాటాల్సిన మొక్కల లక్ష్యం ప్రకారం అవసర మైన మేర గుంతల తవ్వకం త్వరితగతిన పూర్తి చేయాలని, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ సర్వే వివరాలపై ఆరా తీసి, తాగునీటి ఇబ్బందులు గ్రామాలలో రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో ప్రజా పాలన కౌంటర్‌ను పరిశీలించి ప్రతిరోజు వస్తున్న దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.మంథనిలో ఎంఎల్‌ఎస్ పాయిం ట్‌ను ఆయన తనిఖీ చేసి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళు, అంగన్‌వాడి కేంద్రా లకు బియ్యం సరఫరాపై ఆరా తీశారు.
భూ కేటాయింపులు పూర్తి చేయాలి
మంథని పట్టణంలో అభి వృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ పూర్తిచేసి సం బంధిత శాఖలకు భూ కేటా యింపులు చేయాలని సూ చించారు. పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, మున్సిప ల్ కార్యాలయం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రెవెన్యూ డివి జన్ అధికారి కార్యాలయ నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. గుంజమడు గు, సిరిపురం, అడవి సోమన్ పల్లి వద్ద బహుళ జాతి కంపెనీ కోకా కోలా ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం భూసేకరణ వివరాలు, మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సమీకృత గురుకులా ల విద్యా సంస్థల ఏర్పాటు కోసం అవసరమైన 25 ఎకరాల భూమినీ గుర్తించాలన్నారు. సుందిళ్ల బ్యారేజీ, పంప్ హౌజ్ వివరాలను ఆరా తీశారు. వరంగల్-మంచిర్యాల 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం నిర్వాసితులకు జరుగుతున్న చెల్లింపుల పురోగతి వివరాలను అడిగితెలుసుకున్నారు. స్థా నిక ప్రజల నిర్మాణ అవసరాలను తీర్చడానికి మండలంలోని విలోచవరం గోదావరినది తీరం నుంచి స్యాండ్ టాక్సీ విధాన్ని శుక్రవారం ప్రారం భిస్తున్నట్లు వెల్లడించారు. స్యాండ్ ట్యాక్సీ వాహ నాలతో మాత్రమే ఇసును రవాణా చేసుకోవాల ని, ప్రైవేట్‌వాహనాల్లో ఇసుక రవాణా చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.