Share News

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:16 AM

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవా లని సిరిసిల్ల సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ అన్నారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ

సిరిసిల్ల క్రైం, జనవరి 31: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవా లని సిరిసిల్ల సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణ ంలోని అంబేద్కర్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలు తెలిస్తే సమాజంలో జరిగే అన్యా యాలపై ప్రజలను చైతన్యవంతులను చేయవచ్చన్నారు. 0-14సంవత్సరాలలోపు పిల్లలందరూ పనికి వెళ్లకుండా బడిలోనే ఉండాలన్నారు. బాలికలను ఎవరైనా వేధిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంగా బాలికలపై అఘా యిత్యాలు పెరిగాయని , వాటిని నివారించడానికి కృషి చేయాలని అన్నారు. మైనర్‌లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా పోక్సో చట్టం అమలులో ఉందన్నారు. ప్రతీ ఒక్కరు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అన్యాయాలు, అక్రమాలు తగ్గుతాయన్నారు. ఈ సదస్సులో లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, బూరకళ్యాణి, పెంట శ్రీనివాస్‌, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:16 AM