విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:34 AM
విద్యార్థులు పరిశోధన సామర్థ్యా న్ని పెంపొందించుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
ధర్మారం (పెద్దపల్లి రూరల్), అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు పరిశోధన సామర్థ్యా న్ని పెంపొందించుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. శనివారం ధర్మారం మం డలం మల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో విశాఖ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాలకు 50 బెంచీలు అందజేసే కార్యక్రమంలో వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దేవసేన, సిబ్బంది, విద్యార్థులు వంశీ కృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి వంశీకృష్ణ పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో చదువులో ఎక్కువ శ్రద్ధ కనబరచలేదని, కానీ తన తాత స్వర్గీయ వెంకటస్వామి జీవితాన్ని దగ్గర్నుండి చూసిన తర్వాత తాను ఎంతో స్ఫూర్తి పొందానన్నారు. తన కంపెనీ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసి పేటెంట్ కూడా పొందానని పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ దేవసేన పాఠశాలకు బోర్‌వెల్ అవసరముందని కోరగా వెంటనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లనాయక్, బ్లాక్2 అధ్యక్షుడు కోమటి రెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు పాలకుర్తి రాజేశం గౌడ్, బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, గంధం మహిపాల్, పొన్నవేణి స్వామి తదితరులు పాల్గొన్నారు.