Share News

‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:58 PM

పెద్దపల్లి మండలంలోని 15 ఉన్నత పాఠశాలల నుం చి 434 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 400 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు.

‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 30 : పెద్దపల్లి మండలంలోని 15 ఉన్నత పాఠశాలల నుం చి 434 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 400 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. మండలంలో 15 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు తురుకల మద్దికుంట, రాగినే డు, బ్రాహ్మణపల్లి, కొత్తపల్లి, మారేడుగొండ జిల్లా పరిషత్‌ పాఠశాలలు, పెద్దపల్లి గవర్న మెంట్‌ హైస్కూల్‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉత్తమ ప్రతిభ కనబరచిన వి ద్యార్థిని విద్యార్థులను జిల్లా విద్యాధికారి మాధవి, మండల విద్యాధికారి సురేందర్‌ కుమార్‌, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాంరెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఉపాధ్యాయు లు, సిబ్బంది అభినందించారు.

ఎలిగేడు : ఎలిగేడు, ధూళికట్ట, సుల్తాన్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో కవిత తెలిపారు. ధళికట్టలో 20మం ది, ఎలిగేడులో 22మంది, సుల్తాన్‌పూర్‌లో 22మంది పాసె ౖనారని, శ్రీజ 9.5. దినేష్‌ 9.3, సంకీర్తన 9.3. తన్మయ 8.8 జీపీఏ సాధించారని ఆమె పేర్కొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలో ప్రభుత్వ 10 ఉన్నత పా ఠశాలలు, కస్తూర్బా బాలికల విద్యాలయం, మోడల్స్‌ స్కూ ల్‌లలో మొత్తం 247మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 242 మంది ఉత్తీర్ణులైనారు. గంగారం, మల్యాల మొట్లపల్లి, పెగడపల్లి, తారుపల్లి, వెన్నంపెల్లి, కస్తూర్భా బాలికల పాఠ శాలలో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. కునారంలో 75శాతం, మిర్జంపేటలో 80 శాతం, పందిల్లలో 88 శాతం, కాల్వ శ్రీరాంపూర్‌లో 95శాతం, మోడల్‌ స్కూల్‌లో 99శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. పెగడపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సాయిండ్ల అజయ్‌ కుమార్‌, కూస మేఘనలకు 9.8 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలో మొదటి ర్యాంకు సాధించారు. 98 శాతం విద్యార్థులు ఉత్తీ ర్ణత సాధించినట్లు ఎంఈవో సురేందర్‌ తెలిపారు.

ఓదెల : మండలంలో పదవ తరగతి పరీక్షల్లో ఓదెల జడ్పీహెచ్‌ఎస్‌, కొలనూర్‌ హై స్కూల్‌, కస్తూర్బా గాంధీ హై స్కూల్‌లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన కావటి స్రావ్య 9.7జిపిఏ సాధించి మండల టాపర్‌ నిలిచింది. అలాగే ద్వి తీయ స్థానంలో మోడల్‌ హై స్కూల్‌ విద్యార్థులు నిలిచారు. ఓదెల హైస్కూల్లో 22 మంది, కొలనూర్‌ హైస్కూల్లో 16 మంది, ఓదెల కస్తూర్బాగాంధీ బాలికల హైస్కూల్లో 51 మంది 100 శాతం ఉత్తీర్ణులై అయ్యారు. అలాగే మోడల్‌ హైస్కూల్లో 93కు 90 మంది ఉత్తీర్ణత సాధించగా, ఇందు లో టి. ఇంద్ర, సాయి హర్షిత, ఐలు శివతేజ, పర్ష అమూల్య 9.5 జిపి సాధించగా, ఎన్‌ రిషిత 9.3 బి.హర్షిత, బి. హ రిప్రియ 9.2 గ్రేట్‌ సాధించింది.అలాగే మండలంలోని ఏడు హైస్కూల్లో మొత్తం 237 మందికి 231 మంది విద్యార్థులు ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని 97.4శాతం వరకు సాధించారు. ఉత్తీర్ణులు అయ్యి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను చాటిన విద్యార్థులను ఎంఈవో రాజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌ అభినందించారు.

మంథని : ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసిన 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మంథని మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను కనబర్చి ఉత్తమ ఫలితాలు సాధించారు. వీరికి మంత్రి దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు అభినందలు తెలియజేశారు. మంథని కృష్ణవేణి హైస్కూల్‌లో సాదుల శ్రీనిజ 10, స్థానిక జెడ్పీపీ హెచ్‌ఎస్‌ గ్లర్స్‌లో బీ. దీప్తి 9.7, బాలుర పాఠశాలలో జే. విశాల్‌ 9.7, యశ్వంత్‌ 9.7, ఎక్లాస్‌పూర్‌ స్కూల్‌లో ఎస్‌.అన స్మిక 9.7, గుంపడుగు స్కూల్‌లో బీ. తన్వీ 9.3, కన్నాలలో వంశీవర్మ 8.5, ఆరెందలో ఏ. అశ్విని 8.5, జే. జోత్స్నలక్ష్మి 8.5, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏ. సాయిరాజా 7.8 జీపీఏ సాధించారు. కృష్ణవేణిలో 13 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించనట్లు హెచ్‌ఎం జాఫర్‌ తెలి పారు. స్థాని క కాకతీయ ఉన్నత పాఠశాలల్లో సూర్యమణి దీప్‌, అశ్వీత, హరిక, శ్రీవిన్య విద్యార్థులు 10 పాయింట్లు, 11 మంది వి ద్యార్థులు 9 జీపీఏ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ముత్తారం : మండలంలోని ఆదర్శ, కస్తూర్బా పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధిం చారు. రెండు పాఠశాలల్లో బాలికలదే హవాగా నిలిచింది 9.8తో మండల టాపర్‌లుగా నిలిచారు. ఆదర్శ పాఠశాలలో మాదాసి శరణ్య 9.8 శ్రీపతి సంజన 9.7మిన్నపురం రచన 9.7 కస్తూర్బా పాఠశాలలో మేడకొండ అక్షర 9.8 గర్రెపల్లి వర్షిని 9.5గోనెల చైతన్య 9.8గా మార్కుల సాధించారు. ప్రిన్స్‌పాల్స్‌ రాజేశ్వరి, కమలలు అభినందించారు.

జ్యోతినగర్‌ : ఎన్టీపీసీ పరిధిలోని వివిధ పాఠశాలలకు చందిన 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎన్టీ పీసీ టీటీఎస్‌లోని సచ్‌దేవ స్కూల్‌ ఆప్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన 6గురు విద్యార్థులు 10/10 జీపీఏను సాధించారు. కే.శ్రీమా న్‌, ఐ.సుదీప్తి, ఎం.శ్రీకరి, జి.శ్రీవైష్ణవ్‌, ఒ.ఈషేశ్వరి, టి.కుంద న 10 జీపీఏ సాధించారు. 10 జీపీఏ, ఉత్తీర్ణులైన విద్యార్థు లను సచ్‌వేవ ప్రిన్సిపాల్‌ జ్ఞాన్‌చంద్‌ అభినందించారు. విశ్వభారతి పాఠశాలకు చెందిన ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు మె రుగైన ఫలితాలను సాధించారు. పాఠశాలకు చందిన సా త్విక్‌ చరణ్‌ 10 జీపీఏ సాధించడు. ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాల 85.5 శాతం ఉత్తీర్ణత సాధించింది.

కోల్‌సిటీటౌన్‌ : పదో తరగతి ఫలితాల్లో గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్‌కు చెందిన ఐదురుగు విద్యార్థులు 10జీపీఏ సాధించారు. పీ.సాత్విక్‌, కె.సాయినాథ్‌, ఎండి నిహాల్‌, శ్రేయస్‌, ఎం.విఘ్నేష్‌ 10 జీపీఏ సాధించగా 9.8, 9.0 జీపీఏ 56 మంది విద్యార్థులు సాధించారు. కాగా పాఠశాల ఆవరణలో డైరెక్టర్‌ మంజులాశ్రీనివాస్‌రెడ్డి అభి నందించారు. అలాగే గాంధీనగర్‌లోని గీతాంజలి హైస్కూల్‌ కు చెందిన కె.వైష్ణవి, టి.శశాంక్‌లు 10 సాధించారు. కర స్పాండెంట్‌ కంది రవీందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించా రు. నారాయణ స్కూల్‌కు చెందిన ఏడుగురు 10 జీపీఏ సా ధించారు. ఎం.సాత్విక్‌, ఎం.హాసిని, వర్షిని, శ్రేయస్‌, సిరిహా సిని, ఓం దేవేంద్రపాటిల్‌, శ్రీశాంత్‌, సంతోషిలు 10 జీపీఏ సాధించారు. ఏజీఎం చైతన్యరావు, ప్రిన్సిపాల్‌ రజిని, అకాడ మిక్‌ డీన్‌ ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. శ్రీ చైతన్య హైస్కూల్‌కు చెందిన ఏడుగురు 10 జీపీఏ సాధిం చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులను ప్రిన్సిపాల్‌, ఉపా ధ్యాయులు అభినందించారు. రెయిన్‌బో హైస్కూల్‌కు చెంది న నలుగురు 10 జీపీఏ సాధించారు. కరస్పాండెంట్‌ అమ రేందర్‌ వారిని అభినందించారు. కాగా, గోదావరిఖని మహా త్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల బాలుర(రామ గుండం)లోని ఊరగొండ అభిజిత్‌, నల్లాల రాంచరణ్‌, వీ.శ్రీ రాంచరణ్‌ 10 జీపీఏ, మరో ముగ్గురు ఏ.అఖిల్‌వర్మ, జశ్వం త్‌, జీ.విష్ణువర్ధన్‌లు 9.8 జీపీఏ సాధించారు. పాఠశాల 98.5శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థు లను ప్రిన్సిపల్‌ రజిత, ఉపాధ్యాయులు అభినందించారు. అ లాగే స్థానిక మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకు ల పాఠశాలలో 8 మందికి 10 జీపీఏ సాధించారు. ఆడెపు శ్రీవిద్య, అబ్బ సింధు, సలేంద్ర హరిక, దబ్బేట సాయిమాధ వి, యాసర్ల పరిమళ, సింగం సింధు, ఎల్‌.సిరి, కొట్టె పూజి తలకు 10 జీపీఏ సాధించగా, మరో 8 మందికి9.8 జీపీఏలు సాధించారు. కాగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ రజిత, ఉపాధ్యాయులు అభినందించారు.

యైటింక్లయిన్‌కాలనీ : కాలనీ పరిధిలోని పాఠశాలల్లో ఐదుగురు విద్యా ర్థులు 10/10 సాధించారు. మం గళవారం విడు దలైన పదవ తరగతి ఫలితాల్లో స్పందన మోడల్‌ స్కూ ల్‌కు చెందిన ఈ పల్లవి, శ్రీవాత్సవ, ఎండీ రియాన్‌లు 10/10 సాధిం చారు. హరిణి 9.7, సౌమిత్‌ 9.5 గ్రేడింగ్‌ సాధించారు. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన జీ చర ణ్య, ఎం శ్రీరాంలు 10/10 సాధించగా మధుహ 9.8, ప్రియ వందన 9.8, హన్సిత 9.7 గ్రేడింగ్‌లు సాధించారు.

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ పట్టణంలోని అల్ఫోర్స్‌ హై స్కూల్‌ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో విజయకేతనం ఎగురవేశారు. పది మంది విద్యార్థులు పది జీపీఏలు సాధించి అగ్ర స్థానంలో నిలిచారు. వీరందరినీ అల్పోర్స్‌ అధినేత నరేందర్‌ రెడ్డి అభినందించారు. కేరళ మాడల్‌ స్కూల్‌కు చెందిన టి సాయి సిరి, ఆర్‌ శ్రీ హర్షితలు 10జీపీ ఏలు సాధించారు. స్కూల్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధిం చినట్టు కరస్పాండెంట్‌ సిద్దూ తెలిపారు. మండలంలోని ప్రభుత్వ హైస్కూల్స్‌లో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 11 హైస్కూల్స్‌ ఉండగా, ఒక కస్తూర్భా స్కూ ల్‌, ఒక సోషల్‌ వేల్ఫేర్‌ గురుకుల స్కూల్‌ ఉంది. వీటిన్నింటి నుంచి 328 మంది పరీక్షలు రాయగా, 306 మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని కనుకుల హైస్కూల్‌, రేగడిమ ద్దికుంట హైస్కూల్‌, సాంబయ్యపల్లి హైస్కూల్‌, తొగర్రాయి హైస్కూల్స్‌ వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సుల్తానాబాద్‌ ప్రభుత్వ హైస్కూల్‌ నుంచి హరిక 9.8; సుల్తానాబాద్‌ బాలుర హైస్కూల్‌లో అంజన్న 9.3, గర్రెపల్లి హైస్కూల్‌ నుంచి అమూల్య 9.3 జీపీఏ సాధీంచారు. ఉత్త మ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంఈవో సురేందర్‌ అభినందించారు. సుల్తానాబాద్‌ ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన ఆరుగురు, పది జీపీఏలు సాధించారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాషిని, పిట్టల శ్వేత 10జిపిఏలు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. చారుహాషిని, గుమ్మడి వికిత, ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థి కే. హేమలత, మాడల్‌స్కూల్‌ విద్యార్థి ఎస్‌ భవాని, కస్తూరిబా పాఠశాల విద్యార్థి హరిచందన, న్యూబ్రిలియంట్‌లో శ్రీనిత్య, ఆశీష్‌లు 9.7 జిపిఏలు సాధించారు. మండల వ్యాప్తంగా 262 మంది విద్యార్థులు పరిక్షలు రాయగా 248మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు, మండల వ్యాప్తంగా 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో కవిత తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 11:58 PM